
అయితే ఆరోగ్యానికి ఎంత మంచి చేసేది అయినా సరే ఒక లిమిట్ లో ఉంటేనే బాగుంటుంది. లిమిట్ దాటిందంటే చాలు ఆరోగ్యానికి మంచి చేసేది చివరికి ప్రాణాలు తీసేస్తుంది. ఇలా అతిగా వ్యాయామం చేయడం కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా నీరు తాగడం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. సాదరణంగా నీళ్లు తాగడం వల్ల శరీరం ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని.. అలసట రాదని వైద్యులు చెబుతూ ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున ఉన్నప్పటి నుంచి ఇక రాత్రి పడుకునే వరకు నీళ్లు తాగుతూనే ఉండాలని చెబుతూ ఉంటారు.
అయితే డాక్టర్లు చెప్పింది ఈ మహిళకు మరోలా అర్థమైనట్టుంది. దీంతో కేవలం నిమిషాల వ్యవస్థలోనే రెండు లీటర్ల నీళ్లు తాగి చివరికి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఆశ్లే సమ్మర్స అనే 35 ఏళ్ళ మహిళ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అయితే డిహైడ్రేషన్కు గురై నాలుగు బాటిల్స్ నీటిని కేవలం 20 నిమిషాలలో తాగింది సదరు మహిళ. అయితే ఇంటికి వచ్చిన వెంటనే ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది సదరు మహిళ. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.