ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి విన్యాసాలు చేసి చివరికి గిన్నిస్ బుక్ లో తమ పేరును చూసుకొని తెగ ఆనందపడిపోతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అయితే అందరూ చేసే పనులనే కాస్త విచిత్రంగా సరికొత్తగా ట్రై చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడం చూస్తూ ఉన్నారూ. ఇలాంటివి చేసి కూడా వరల్డ్ రికార్డ్ సృష్టించవచ్చా అని ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే. ఏకంగా గడ్డం పెంచుకోవడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ అయింది. అదేంటి గడ్డం పెంచుకున్న వరల్డ్ రికార్డు సృష్టించవచ్చా అంటారా.. అయితే ఇక్కడ గడ్డం పెంచుకుంది అబ్బాయి కాదు ఏకంగా అమ్మాయి.
ఎలాగైనా గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాలి అనుకున్న మహిళ సరికొత్తగా ఆలోచించింది. ఈ క్రమంలోనే గడ్డం పెంచుకుని అత్యంత పొడవైన గడ్డంతో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలోని మిచ్చిగాన్ కి చెందిన 38 ఎరిన్ హానికట్ హార్మోన్ల సమస్య కారణంగా అధిక జుట్టు పెరగడం స్టార్ట్ అయింది. దీంతో ఆమె ముఖంపై పెరిగిన గడ్డం 11.8 అంగుళాలకు చేరుకుంది . దీంతో గిన్నిస్ బుక్ రికార్డు కోసం అప్లై చేసుకుంది. అయితే ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం కలిగిన మహిళగా ఆమెకు వరల్డ్ రికార్డు వరించండి. కాగా గతంలో ఈ రికార్డు 10.04 అంగుళాల గడ్డంతో ఉండే వివియన్ వీలర్ పేరిట ఉండేది. ఇక ఇటీవల హానికట్ ఈ రికార్డు బద్దలు కొట్టింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి