రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో నానా జాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ విఫలం అయ్యింది. దాంతో నానాజాతి సమితికి బదులుగా 1945 లో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశారు. ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై కలిసి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఐక్య రాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాయి. దీని ద్వారా ప్రపంచ దేశాలు ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే విషయం పై ఐక్య రాజ్యసమితి లోని దేశాలన్నీ కూర్చుని నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి.


అంతే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మానవ హక్కుల  ఉల్లంఘన జరిగినా ఈ ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ కలిసి ఘాటుగా స్పందిస్తాయి.  తాజాగా టర్కీకి సంబంధించిన వీగర్ జాతికి చెందిన వాళ్లు ఐక్యరాజ్యసమితి వేదిక మీద తమ వేదనను తెలియజేశారని తెలుస్తుంది. ఈ వీగర్లు అనేవాళ్ళు సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన మధ్య అలాగే తూర్పు ఆసియాల నుండి వచ్చినటువంటి తెగకు సంబంధించిన వాళ్ళు.


వీళ్లు చైనా  అధికారికంగా  గుర్తించిన 55 మైనార్టీ జాతుల్లో ఒకరైన టర్కీక్ జాతి కి చెందినవారు. సెప్టెంబర్ 27 వ తేదీన  జెనీవాలోని ఒక సాధారణ చర్చిలో యు ఎన్ హెచ్ ఆర్ సి 54వ సెషన్ లో వీగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు డోల్కున్ ఇసా  ప్రసంగించడం జరిగింది. అయితే ఆయన ప్రసంగాన్ని చైనీయులు రెండుసార్లు అడ్డుకున్నారు . సో కాల్డ్ ఎన్జీవో అని పిలవబడే ఇసా అనే చైనా దౌత్యవేత్త అసలు వారి ప్రతినిధి కాదని కొందరు చెప్పడం జరిగింది.  


అయితే, యు యెన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ అహ్మద్ వీగర్ ఆయనను తన ప్రకటనను పూర్తి చేయడానికి అనుమతించారు. ఈ సందర్భంగా చైనాలో  వీగర్ లపై మారణహోమం జరుగుతుందని ఆయన అన్నారు. దీనిపై ఐక్యరాజ్యసమితి  సభ్య దేశాలు అలాగే యు ఎన్ సంస్థలు చర్య తీసుకోవాలని   డోల్కున్ ఇసా మరోసారి కోరడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: