ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం మొదలై ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. అయినా యుద్ధం మాత్రం అస్సలు ఆగడం లేదు. అయితే ఇరుదేశాలు కూడా ఒకరిపై ఒకరు ఏకంగా బాంబుల వర్షం కురిపించుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఏకంగా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక రెండు దేశాల ప్రజలకు శాపంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి మిస్సైల్ మీద పడిపోతుందో అని ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా వేలమంది సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎంతలా ప్రాణ నష్టం వాటిల్లుతున్నప్పటికీ యుద్ధం ఆపే ఆలోచన మాత్రం చేయడం లేదు. ఎన్నిసార్లు శాంతి చర్చలు జరిగిన విఫలం అవుతూనే వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఏకంగా ఇజ్రాయిల్ పై బాంబుల వర్షం కురిపించాలి అనే తొందరలో ఇటీవలే రష్యా ఒక చేయకూడని పని చేసింది. ఏకంగా సొంత గ్రామం పైనే బాంబులు వేసింది రష్యా. ఇది కాస్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 అయితే ఈ విషయాన్ని రష్యా ఆర్మీ స్వయంగా అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇటీవలే ఉదయం రష్యా కి చెందిన వరోనెట్స్ ప్రాంతంలోని ఒక గ్రామం పై రష్యా సైన్యాలు బాంబుల్ని ప్రయోగించాయి. అయితే ఇది ఎలా జరిగింది అన్న విషయం మాత్రం తమకు తెలియదు అంటూ రష్యా ఆర్మీ ప్రకటించడం గమనార్హం. దీనిపై విచారణ ప్రారంభించామని.. సైనిక ఉన్నతాధికారులు తెలిపారు.  అయితే ఈ బాంబుల దాడిలో అదృష్టవశాత్తు ఆస్తి నష్టం తప్ప.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం గమనార్హం. అయితే మరోసారి ఇలాంటి పొరపాటు జరుగుకుండా జాగ్రత్తలు తీసుకుంటామని రష్యా ఆర్మీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: