మారుతున్న మనిషి జీవన శైలి, పెరిగి పోతున్న మనిషి జీవన వ్యయం కారణం గా పెళ్లి అనే ఆలోచన చేయడానికి ఎంతో మంది యువత భయపడిపోతున్నారు. ఇక ఒకప్పుడు ఏదో ఒక ఉద్యోగం దొరకగానే పెళ్లి చేసుకొని.. వైవాహిక బంధాన్ని కొనసాగించాలని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా భారీగా సంపాదించి.. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి.. లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి అనే ఆలోచన చేయాలని అందరూ అనుకుంటున్నారు.


 ఈ క్రమం లోనే ఒకప్పుడు పాతికేళ్లలోపు పెళ్లి చేసుకుంటే.. ఇప్పుడు మాత్రం 30ఏళ్ళు దాటిన తర్వాత కూడా చాలా మంది యువత పెళ్లి చేసుకోవాలని ఆలోచన చేయడం లేదు. అయితే ఇండియాలో ఇలాంటి పరిస్థితి నెలకొంటే అటు జపాన్ లో మాత్రం మరింత విపత్కర పరిస్థితులు నెలకొన్నాయ్. అక్కడ మగవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడటం లేదట. ఇక జీవితాంతం అలాగే ఒంటరిగా ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారట. దీంతో జపాన్ దేశంలో 50 ఏళ్లకు పైబడి వయస్సు ఉండి ఒంటరిగా జీవిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందట. ఇలాంటి పరిణామాల కారణంగా జపాన్లో జననాల రేటు కూడా తగ్గిపోతుందని తెలుస్తోంది. ఇలా జననాల రేటు తగ్గిపోవడం సామాజిక సమతుల్యతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని.. అక్కడ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి ఒంటరి వృద్ధులు అంటే 65 ఏళ్ల పైబడిన కుటుంబాల సంఖ్య 23.3 మిలియన్లకు చేరుకుంటుందని ఆ దేశ ప్రభుత్వ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇక మొత్తం జనాభాలో ఇది 46.5% ఉండవచ్చు అని పేర్కొంటున్నారు. ఇక ఇటీవల కాలంలో జపాన్ యువత పెళ్లిళ్లపై ఆసక్తి చూపించడం లేదు. టోక్యోలో 50 ఏళ్ల వయసు దాటిపోతున్న ఎంతోమంది ఒంటరిగా సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: