ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కొందరి వైఖరిలో మాత్రం కచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. రాజకీయంగా పార్టీ ఇప్పుడు ముందుకు నడవాలి అంటే మాత్రం వర్గ విభేదాలు ఉండకూడదు. కొంత మంది ఏకపక్ష పెత్తనాలు వంటివి ఉండకూడదు. రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి పార్టీ అధిష్టానం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే ఈ తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  వహరిస్తున్న వ్యవహార శైలి పార్టీలో సంచలనంగా మారింది.


రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొంత మంది యువ నేతలు అవసరం ఉంది. అయితే ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వారందరి మీద సోషల్ మీడియాలో కొందరి చేత తప్పుడు రాతలు రాస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల బయటకు వచ్చిన కొంత మంది కీలక నేతల విషయంలో కూడా దాదాపుగా ఇదే చేశారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే గా ఉన్న దూళిపాళ్ల నరేంద్ర విషయంలో రాజకీయంగా నారా లోకేష్ ఇదే చేశారని అంటున్నారు. దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ని ఇబ్బంది పెట్టే విధంగా సోషల్ మీడియాలో కొంత మంది వ్యాఖ్యలు కూడా చేశారట.


అదే విధంగా ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్ పై కూడా సోషల్ మీడియాలో కొందరు అనవసర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు టిడిపి వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కీలక నేతల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించడంతో గల్లా జయదేవ్ కూడా దాదాపుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కీలకంగా ఉండి బయటకు వచ్చి మాట్లాడుతున్న వారి విషయంలో లోకేష్ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు భావ్యమని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానించడం విడ్డూరం.

మరింత సమాచారం తెలుసుకోండి: