ఇప్పటి కాలంలో ఆన్‌లైన్‌ గేమ్స్, క్రికెట్‌ బెట్టింగ్‌లు వగైరా విపరీతంగా పెరిగి పోతున్నాయి. చాల మంది వీటికి బానిసలు అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా  యువకులు వీటికి  ఆకర్షితులవుతూ డబ్బులు పోగొట్టుకుని బజారున పడుతున్నారు. డబ్బులు లేకున్నా అప్పులు చేసి మరీ ఆడడం తో జీవితాలు రోడ్డుపాలు అవుతున్నాయి. వీటిని అదుపు చేయడం కూడా కష్టమైనా పనే. పల్లె , పట్టణం అని తేడా లేకుండా ఎవరికీ వాళ్ళు రమ్మీ ఆడుతూ , క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్ట పోతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ లాక్‌డౌన్‌ కాలంలో యువతకు మరింత ఖాళీ సమయం దొరకడంతో ఆన్‌లైన్‌లో గడపడం ఈ పరిస్థితులకు దారి తీసిందని పలువురు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు తప్పక పిలల్లని గమనించాలి. ఇలా చెయ్యకపోతే పిల్లలు దారి తప్పి ఇటువంటి వాటికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్‌ 19న ప్రారంభమైన ఐపీఎల్‌ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఐపీఎల్‌ బెట్టింగ్‌లో ఇటీవల పోలీసులకు పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే. ఈజీ మనీ కోసం బుకీలు వాట్సాప్, ఆన్‌లైన్‌ లోనే బెట్టింగ్‌ నిర్వహిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతూ చాలా మంది గుడ్డిగా మోసపోతున్నారు.  డబ్బులు కాళీ అయినా అదే దారిలో వెళ్తున్నారు. మొదట  డబ్బు సంపాదించవచ్చేనే ఆశతో ఉంది ఆడడానికి వెళ్లి.... ఆఖరికి అప్పులపాలై వస్తున్నారు.  ఇలా వీళ్ళు లక్షల్లో నష్టపోతున్నారు. ఆఖరికి భవిష్యత్‌ ని  నాశనం చేసుకుంటున్నారు. యువత క్రికెట్‌ బెట్టింగ్ ‌లకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి అనవసరంగా డబ్బులు నష్టపోకూడదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు అని అధికారులు అంటున్నారు. టైం పాస్‌ కోసం ఆన్‌లైన్‌ రమ్మీ కి అలవాటు పడ్డారు. ఆ అలవాటు కాస్తా వ్యసనంగా మారి అప్పులు వగైరా వాటికి దారి తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: