ఏపీలో ప్ర‌కాశం జిల్లా ఒంగోలు క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని తేజశ్రీ ఆత్మహత్య చేసుకున్నారు. ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన ఫీజు రియింబ‌ర్స్ మెంట్ రాక‌పోవంతో ఆమె తండ్రి ఆమె ఫీజు క‌ట్టేందుకు బ‌య‌ట రు. 5 నుంచి రు. 10 వ‌డ్డీల‌కు అప్పులు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ అప్పులు తీర్చాల్సిన వారు తండ్రిపై తీవ్ర ఒత్తిడి చేయ‌డంతోనే త‌న వ‌ల్లే తండ్రి ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే నిజ‌మైతే ప్ర‌భుత్వం దీని గురించి సీరియ‌స్ గా ఆలోచ‌న చేయాల్సి ఉంటుంది.

ఇక ఈ రీయింబ‌ర్స్ మెంట్ గోల గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌లోనూ ఉంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చా ఆ ప్ర‌భుత్వం చెల్లించాల్సిన వాటిలో కొద్ది బ‌కాయిలు చెల్లించి.. ఆ త‌ర్వాత నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే వేస్తామ‌ని చెప్పారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ని చేసిన పాపాన పోలేదు. దీంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న కాలేజీలు విద్యార్థుల‌పై ఒత్తిడి చేసి మ‌రీ ఈ బ‌కాయిలు వ‌సూలు చేస్తున్నాయి. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తేజ శ్రీ ఆత్మ‌హ‌త్య ఉదంతం వైర‌ల్ గా మారింది. దీనిపై రాజ‌కీయ నాయ‌కులు ఎంత స్పందిస్తున్నా ముందుగా మోహ‌న్ బాబే గుర్తుకు వ‌స్తారు. ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు రీ యింబ‌ర్స్ మెంట్ రాక త‌న ఆస్తులు సైతం తాక‌ట్టు పెట్టాన‌ని చెప్పారు. తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు.

ఇప్పుడు ఆయ‌న నోటి నుంచి రీ యింబ‌ర్స్ మెంట్ అన్న మాటే రావ‌డం లేదు. అయితే త‌న అసంతృప్తిని మాత్రం వెళ్ల‌గ‌క్కుతూనే ఉన్నార‌ట‌. ఏదేమైనా జ‌గ‌న్ నాడు మోహ‌న్ బాబు రీ యింబ‌ర్స్ మెంట్ ఇవ్వ‌క విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాడం ఆడ‌వ‌ద్దు బాబు అని వార్నింగ్ ఇచ్చారు. అనేక కార‌ణాల‌తో బాబు ఓడిపోయారు. ఇప్పుడు ఈ విష‌యంపై జ‌గ‌న్ అయినా సీరియ‌స్ గా దృష్టి పెట్ట‌క‌పోతే జ‌గ‌న్ స‌ర్కార్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వ‌డం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: