కరోనా మహమ్మారి  ఏమని జనాల మధ్యలోకి వచ్చిందో కానీ మానవత్వం కూడా మనుషుల మద్య పెరిగింది. అది కూడా కొంతమందికి మాత్రమే ఉంటుంది..లాక్ డౌన్ కారణంగా అందరి ఆర్ధిక పరిస్థితి మరీ దారుణంగా మారింది.ప్రజలందరికీ వ్యాక్సిన్‌ ఖర్చుల్ని భరించడం కేరళకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కోసం విరాళాలు ఇవ్వాలని సీఎం పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. విరాళాలు వెల్లువలా వచ్చి చేరాయి.కరోనా రోగులకు అండగా నిలుస్తున్నారు. ప్రాణం ఖరీదు కట్టలేనిది అనే దృక్పథంలో జనాలు ఇలా చేయడం నిజంగా గ్రేట్.. 


ఈ క్రమంలో ఎన్నో కొత్త కథలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.అందులో భాగంగా బీడీ కార్మికుడి త్యాగం బయటకు వచ్చింది.వివరాల్లోకి వెళితే.. కన్నూర్‌కు చెందిన ఓ బీడీ కార్మికుడు తాను బ్యాంకు లో దాచుకున్న రూ.రెండు లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేశారు. ప్రస్తుతం ఖాతాలో రూ.850 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది చూసి ఆశ్చర్యపోయిన బ్యాంకు అధికారులు.. ఆయన ఆర్థిక స్తోమతను అర్థం చేసుకొని తొలుత రూ.లక్ష మాత్రమే ఇవ్వాలని సూచించారు. కానీ, అతను మాత్రం అందుకు నిరాకరించారు..


కరోనా రోగులకు ఇవ్వాలి.. వారిని ఆదుకోవాలి.. పైగా  దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్‌ కూడా వస్తోంది. సాటి మనుషుల ప్రాణాల కంటే నా డబ్బు గొప్పదేం కాదు'' అంటూ ఆయన ఇచ్చిన సమాధానం వారందరి మనసుల్ని కట్టిపడేసింది. పైగా తన పేరు ఎక్కడా చెప్పొద్దని కూడా బ్యాంకు అధికారుల్ని  కోరాడట.. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. అతని త్యాగం పై ప్రశంశలు అందుతున్నాయి..ఈ పోస్ట్ ను చూసిన ఎవరైనా కూడా సాయం చేయడానికి ముందుకొస్తే బాగుండునని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: