ప్రతీ ఇంటికి కావాల్సిన అత్యవసరాల్లో కరెంటు తప్పకుండా ఉంటుంది. ఇకపోతే విద్యుత్ వినియోగం స్మార్ట్‌గా ఉంచేందుకుగాను కేంద్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసింది. ఈ స్మార్ట్ మీటర్ల ఇన్‌స్టాలేషన్‌కు కేంద్రం గడువు విధించింది.  2025 మార్చి కల్లా దేశవ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్స్ అవెయిలబుల్‌గా ఉండబోతున్నాయి. ప్రస్తుత కరెంట్ మీటర్ల స్థానంలో నూతన మీటర్లు రాబోతున్నాయి. విద్యుత్ రంగంతో నూతన సంస్కరణలను ప్రోత్సహించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే స్మార్ట్ కరెంట్ మీటర్స్‌ను ఇన్ స్టాల్ చేయబోతున్నారు. అయితే, ఈ మీటర్స్ ఇన్‌స్టాల్ చేయడంలో భాగంగా విద్యుత్ వినియోగదారులు ముందుగానే మనీ పే చేయాల్సి ఉంటుందనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

 ఫోన్ రీచార్జ్ మాదిరిగానే ఇక భవిష్యత్తులోనూ డబ్బులు కట్టి కరెంటు వాడుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది. అయితే, ప్రజెంట్ మనం నెలంతా కరెంటు ఉపయోగించుకొని, బిల్లు వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేస్తుంటాం. కానీ, ఒకసారి కొత్త స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత పరిస్థితులు అలా ఉండబోవు. ఈ మీటర్స్ ఇన్‌స్టాలేషన్ చేయడం ద్వారా కరెంట్ మీటరును రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం. అయితే, ఇక కరెంట్  మీరు ఎంత మొత్తానికి రీచార్జ్ చేసుకుంటారో అంత మొత్తం వరకే మీరు విద్యుత్ వాడుకోవాల్సి ఉంటుంది. ఇక కరెంట్ రీచార్జ్ అయిపోయే క్రమంలో మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు మళ్లీ మళ్లీ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం ప్రకారం 2023 డిసెంబర్, 2025 మార్చి నాటికి రెండు దశల్లో దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్స్ అందుబాటులోకి రానున్నాయి.
 
అయితే, రైతులకు మినహాయించి మిగతా వారందరికీ ఈ స్మార్ట్ మీటర్స్ ఇన్‌స్టాల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కేంద్రప్రభతువ్ం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. చూడాలి మరి.. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువులోగా స్మార్ట్ మీటర్స్‌ను అధికారులు ఇన్‌స్టాల్ చేస్తోరో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: