ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను తెలుగు సినిమాతో ఎలా విడ‌దీయ‌లేమో.. అలాగే ఆయ‌న్ను పుస్త‌కాల‌ను వేరు చేసి చూడ‌లేం. స‌మ‌యం దొరికితే చాలు పుస్త‌కాల పురుగు అవుతాడు జ‌న‌సేనాని. త‌న చిన్న‌ప్పుడు పాఠ‌శాల‌కు వెళ్తుంటే గోడల మీద `తాక‌ట్టులో భార‌త‌దేశం` అనే ప‌దాలు ఆయ‌న్ను ఆలోచ‌న‌లో ప‌డేశాయ‌ని ఓ సంద‌ర్భంలో చెప్పాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆ పుస్త‌కాన్ని ఇంట‌ర్‌లో చ‌దివాన‌ని అందులోని అంశాలు త‌న‌పై చాలా ప్ర‌భావం చూపింద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబుతుంటారు.

`గ‌డ్డిప‌ర‌క‌తో విప్ల‌వం`

జపాన్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త మసనోబు ఫుకుఓకా అభిప్రాయాల‌ను `గ‌డ్డిప‌ర‌క‌తో విప్ల‌వం` పుస్త‌కంలో వెల్ల‌డించారు. పురుగుల మందులు, ర‌సాయ‌నిక ఎరువుల‌తో వ్య‌వ‌సాయం చేయ‌డం ద్వారానే కాకుండా స‌హ‌జ ప‌ద్ధ‌తిలో అధిక దిగుబ‌డి పొంద‌వ‌చ్చ‌ని నిరూపించారు ఆయ‌న‌. త‌న అభిప్రాయాల‌ను, ప‌రిశోధ‌న‌లను వెల్ల‌డించిన `గ‌డ్డి ప‌ర‌క‌తో విప్ల‌పం` పుస్త‌కం కూడా ప‌వ‌న్‌కు ఇష్ట‌మే. ఈ పుస్త‌కాన్ని చ‌దవాల‌ని ఓసారి సూచించారు ప‌వ‌న్‌.

లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌

  స్వేచ్ఛ కోసం 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన నెల్సన్‌ మండేలా రాసిన ‘లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడమ్‌’ పుస్త‌కం కూడా ప‌వ‌న్ ప్ర‌భావితం చేసిన పుస్త‌కాల్లో ఒక‌టి. ‘బద్రి’ సినిమా సమయంలో మండేలా జైలు శిక్ష అనుభవించిన గదిని స్వయంగా వెళ్లి చూసి వచ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఆయన పోరాట పటిమ తనలో స్ఫూర్తి నింపిందంటారు పవన్ చెబుతుంటారు.

వనవాసి..

  బెంగాలీ ర‌చ‌యిత బిభూతి భూష‌న్ బందోపాధ్యాయ రాసిన వాన‌వాసి ప‌వ‌న్‌ను ప్ర‌కృతితో మ‌మేకం అయ్యేలా చేసింద‌ని చెప్పారు ఆయ‌న‌. ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రీకరణ జరుపుకొంటున్న సమయంలో ‘వనవాసి’ చదవాలని పవన్‌కు ఆసక్తిక‌ల‌గ‌డంతో ఎంత వెతికినా ఆ పుస్తకం దొరకలేదు. చివరకు ఎలాగోలా ఆ పుస్త‌కం పవన్‌ చేతుల్లోకి వెళ్లింది.

మార్టిన్‌ లూథర్‌కింగ్‌, చేగువేరా

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందరూ తప్పకుండా చదవాలని చెప్పిన వాటిలో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పుస్తకాలు కూడా ఉన్నాయి. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పుస్తకాల ప్రభావం ప‌వ‌న్‌ కొన్నేళ్లపాటు వెంటాడిందని చెప్పారు. చెగువేర జీవితం, సాహిత్యం కూడా త‌న‌లో అంతే ఆవేశాన్ని రగిలించిందని ప‌వ‌ర్‌స్టార్ చెబుతాడు.

ప‌వ‌న్ ప్ర‌స్తావించిన మ‌రికొన్ని పుస్త‌కాలు..

 గుంటూరు శేషేంద్ర శ‌ర్మ ర‌చించిన ఆధునిక మ‌హాభార‌తం, జ‌న‌వంశ‌క పుస్త‌కాలు లాంటివి. అలాగే అమృతం కురిసిన రాత్రి, తొలిపొద్దు, ఖార‌వేలుడు, ఐ- ది సిటిజ‌న్ లాంటి పుస్త‌కాలు ఇలా చాలా పుస్త‌కాలు ప‌వ‌న్‌ను ప్ర‌భావితం చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: