గత కొంత కాలం నుంచి భారత్ చైనా సరిహద్దుల్లో ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ప్రశాంతంగా ఉన్న భూభాగంలో చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం రావడానికి కారణమైంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న పలు ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి ఎప్పుడూ ఏదో ఒక రకంగా ప్లాన్ చేస్తూ కుట్ర పన్నుతూనే ఉంది చైనా.  ఈ క్రమంలోనే అటు భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉంటూ చైనా కు ధీటుగా బదులిస్తోంది.  దీంతో భారత భూభాగాన్ని భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకొన్న చైనాకు వరుసగా షాకులు తగులుతున్నాయి అని చెప్పాలి.



 అంతేకాకుండా చైనా భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు దేశాల మధ్య పలుమార్లు కమాండర్ స్థాయి చర్చలు జరిగాయ్. ఇలా చర్చలు జరిగిన సమయంలో తాము వెనక్కి తగ్గుతాము అంటూ ఒప్పందం చేసుకున్న చైనా  ఆ తర్వాత మాత్రం మళ్లీ కుక్క తోక వంకర అనే విధంగానే వ్యవహరిస్తుంది. అయితే గత కొంత కాలం నుంచి భారత్ కూడా ఎంతో దూకుడుగా ముందుకు సాగుతోంది. చైనా తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడంలో విజయం సాధిస్తుంది. ఇక ఇటీవల మరోసారి భారత్-చైనా మధ్య కమాండర్   స్థాయి చర్చలు జరిగాయి.  ఇక ఈ చర్చల్లో చైనా దే తప్పు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన భారత్ ఏకంగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.



 పాంగ్ వాన్ సో సరస్సు దగ్గర నిషేధిత  భూభాగంలోకి వచ్చింది మీరు.. సరివిభేదాలకు ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయింది మీరు.. తూర్పు లడక్ ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాలు చేసింది మీరు..  అరుణాచల్ ప్రదేశ్లోని టవాంగా ప్రాంతంలో చొరబాటు ప్రయత్నాలు చేసింది మీరు. చొరబాటు ప్రయత్నాలతో పాటు సుదీర్ఘకాలం పాటు ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యింది మీరు.  అలాంటి మీరు ఇప్పుడు భారత్ను వేలెత్తి చూపేట్టవలసిన అర్హత లేదు అంటూ ఈ కమాండర్ స్థాయి చర్చల్లో భారత ఆర్మీ చైనాకు స్పష్టం చేసింది. 1962 సమయంలో ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా వదిలి పెట్టాల్సిందే. ఇప్పటికైనా తీరు మార్చుకోండి భారత భూభాగాలను మాది అని చెబితే అంగీకరించడానికి సిద్ధంగా లేము. జాగ్రత్త అంటూ భారత ఆర్మీ చైనాకు  వార్నింగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: