గత కొంత కాలంగా చైనా ముస్లీమ్ మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నా అటువంటి చర్యలు ఏమీ  జరగడం లేదని చైనా కొట్టిపారేసిన సందర్భాలు లేకపోలేదు. తాజాగా జరిగిన ఓ దుస్సంఘటన ఈ ఆరోపణలకు గట్టి పునాది వేస్తోంది . అయితే గడిచిన రెండు రోజుల్లో ఇద్దరు మహిళలను చైనా ప్రభుత్వం అరెస్ట్ చేసింది . అందుకు కారణాలు ఏమిటంటే ఒకరిపై కేవలం వాట్సాప్ డౌన్ లోడ్ చేసుకున్నందుకు , మరొక మహిళ తన ఇమెయిల్ పాస్వర్డ్ వేరొకరితో షేర్ చేసుకుందుకు. ఇలాంటి సిల్లీ రీజన్స్ తో చైనాలో నివసిస్తున్న ముస్లీమ్ మహిళలను నిత్యం టార్గెట్ చేస్తూ చిత్ర హింసలకు గురిచేస్తున్నారు.  వారిని  ప్రీ-క్రిమినల్స్‌గా గుర్తించి , రీ-ఎడ్యుకేషన్ క్లాస్‌లకు  పంపిస్తోంది. వారు స్థానిక పరిసరాల్లోనే ఉండాలి ,  రెగ్యులర్‌గా వారు  సోషల్ స్టెబిలిటీ వర్కర్‌ను కలవాల్సి ఉంటుందని చెబుతున్నారు.




 ఈ మొత్తం కథను "ఇన్‌ ది క్యాంపస్‌ చైనా హై-టెక్‌ పె నాల్‌ కాలనీ" అనే పుస్తకం లో పొందుపర్చారు. ఈ పుస్తకం ప్రకారం కేవలం ఈ ఇద్దరు మహిళలు మాత్రమే కాకుండా మరో 11 మంది ముస్లింలను అదుపులోకి తీసుకుని వారిపై క్రిమినల్స్అనే ముద్ర వేసినట్లుగా కనిపిస్తోంది. చైనా జైళ్లలో 10 వేల మంది వీగర్లు వారితోపాటుగా ముస్లీ ప్రజలు క్యాంపుల్లో మగ్గుతున్నారు , ఈ విషయాన్నీ మానవ హక్కుల డేటా చెబుతున్నది.  రీ-ఎడ్యుకేషన్ క్లాస్‌ క్యాంప్ ల పేరుతో జైళ్లల్లో ఉన్నవారిని చిత్రహింసలకు గురిచేస్తోంది చైనా . ఇదంతా ఒక ఎత్తయితే యాప్ లపై నిఘాపెట్టి ముస్లీమ్ మహిళలను టార్గెట్ చేస్తోంది. ఈ కారణంగా ప్రపంచదేశాలనుండి తీవ్ర వ్యతిరేకత చైనా ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ముస్లీమ్ మహిళల వ్యక్తిగత విషయాలపై చైనా చూపిస్తున్న అత్యుత్సహం చూసి ప్రపంచదేశాలు విమర్శలను గుప్పిస్తున్నాయి. అయినా చైనా మాత్రం తన పని తాను చేసుకొని పోతు ఉంది. ముస్లీమ్ మహిళలను టార్గెట్ చేస్తూ ముస్లీమ్ దేశాలతో ఎలా స్నేహ హస్తాన్ని చూపిస్తోందన్న సందేహం రాక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: