తెలంగాణ లో ఇప్పుడు అంద‌రి దృష్టి ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఇక్క‌డ నుంచి నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ ను మంత్రి ప‌ద‌వి నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డం.. ఆ త‌ర్వాత ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లేలా చేయ‌డం.. చివ‌ర‌కు ఈట‌ల బీజేపీలో చేర‌డం.. బీజేపీలో చేరిన ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌డం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఈట‌ల రాజీనామాతో ఇప్పుడు అక్క‌డ ఉప ఎన్నిక జ‌రుగుతోంది. దీంతో ఈ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో 2023 ఎన్నిక‌ల‌కు ఓ దిక్సూచి అవుతుంద‌న్న విశ్లేష‌ణ లు కూడా ఉన్నాయి. మ‌రో వైపు తెలంగాణ పీ సీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి వ‌చ్చాక ఆయ‌న ఎదుర్కొంటోన్న తొలి ఎన్నిక కావ‌డం తో ఆయ‌న‌కు కూడా ఈ ఉప ఎన్నిక పెద్ద ప‌రీక్ష‌గా మార‌నుంది.

ఇటు కేసీఆర్ కూడా ఈ ఉప ఎన్నిక‌ను చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. ఇప్ప‌టికే దుబ్బాక ఉప ఎన్నిక‌ల‌లో బీజేపీ ఇచ్చిన షాక్ నుంచి కేసీఆర్ తో పాటు టీఆర్ ఎస్ అగ్ర నాయ‌క‌త్వం కోలుకోవ‌డం లేదు. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా బీజేపీ గెలిస్తే కేసీఆర్ మ‌రింత ఇర‌కాటంలో ప‌డ‌తాడు. దీంతో ఈ ఉప ఎన్నిక‌ల‌లో ఎలాగైనా ఈట‌ల‌ను ఓడించి తెలంగాణ లో బీజేపీ ది బ‌లుపు కాద‌ని. అదంతా వాపే అని ఫ్రూవ్ చేయాల‌ని కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు.

ఇప్ప‌టికే ఈ ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను మంత్రి హ‌రీష్ రావుతో పాటు క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన కొంద‌రు మంత్రుల‌కు అప్ప‌గించారు. రేప‌టి ఫ‌లితాల‌లో తేడా వ‌స్తే కొంద‌రు మంత్రులు ఇంటికి వెళ్లి పోతార‌ని కూడా పార్టీ లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. హుజూరాబాద్ లో టీఆర్ ఎస్ ఓడిపోతే ముందుగా బ‌య‌ట‌కు వెళ్లేది గంగుల క‌మ‌లాక‌రే అని అంటున్నారు. ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు మంత్రుల‌ను కూడా కేసీఆర్ బ‌య‌ట‌కు పంపేస్తార‌ని టాక్ ?

మరింత సమాచారం తెలుసుకోండి: