ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ... ప్రగతి రధ చక్రం ఇప్పుడు పూర్తిగా కుదేలైంది. ఇప్పటి వరకు అలా అలా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు... ఇప్పుడు పూర్తిగా మూలకు చేరుతున్నాయి. అసలు ఆర్టీసీ పరిస్థితి ప్రస్తుతం పాపం అనిపిస్తోంది. పై నుంచి చూస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది.... కానీ లోపలికి చూస్తే మాత్రం అసలు నిజం బయట పడుతుంది. ఇంకా చెప్పాలంటే... అయ్యో అంటూ బాధపడే పరిస్థితి. అసలే నష్టాల్లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ సంస్థకు కరోనా మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. ఏకంగా రెండు నెలల పాటు బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. ఆ తర్వాత కూడా పరిమిత సంఖ్యలో ప్రయాణీకులను అనుమతించారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో బస్సులు రొడ్లు ఎక్కలేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ చర్యలు మరిన్ని కష్టాలు తెస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఆర్టీసీ నిధులను మళ్లిస్తోంది కూడా. నవరత్నాల పథకాల కోసం ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ నిధులను కూడా మళ్లిస్తోంది.

ఇప్పుడు ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి ఉంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఓ వైపు డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటం.... దీనికి తగినట్లుగా టికెట్ ధరలు పెరగ లేదు. ఇక టోల్ గేట్ ధరలు, వాహనాల రిజిస్ట్రేషన్, నిర్వహణ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. వీటికి తోడు గతేడాది మార్చి నెల నుంచి అన్ని డిపోల్లో కూడా ఆర్టీసీ క్యాంటిన్లకు కేటాయించిన స్థలాలు దాదాపు ఖాళీగానే ఉంటున్నాయి. వీటి ద్వారా ప్రత్యేక ఆదాయం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్త బస్సులు కాదు కదా... కనీసం బస్సులకు టైర్లు కూడా కొనలేని దుస్థితి ఆర్టీసీ సంస్థది. రహదారులు పూర్తిగా గోతుల మయం అవడంతో... దాదాపు అన్ని బస్సులు కూడా డొక్కు డొక్కు అవుతున్నాయి. టైర్లు అరిగిపోతున్నాయి. ఒక్క బస్సుకు స్టెప్నీతో కలిపి ఏడు టైర్లు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. కానీ నిధుల కొరత కారణంగా ప్రస్తుతం ఒక్క టైరు కూడా కొనలేని పరిస్థితి. ఒక్క బాపట్ల బస్ డిపోలోనే టైర్లు లేక దాదాపు పది బస్సులు నిలిచిపోయాయంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: