జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన  పథకాలు ప్రవేశపెడుతు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులందరికీ మెరుగైన విద్యను చేరువ చేసే విధంగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. నాడు నేడు అనే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసారూ. ముఖ్యంగా పేద విద్యార్థులు అందరికీ మధ్యాహ్న భోజన పథకం కింద ఎంతో పౌష్టిక ఆహారాన్ని అందించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పాలి.


 ఇలాప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులు అందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందజేసేందుకు ప్రభుత్వం కోట్లరూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పొందుతున్నారు. కానీ కొన్ని పాఠశాలల్లో మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా జగన్ ప్రభుత్వం అందరికీ పౌష్టికాహారం అందించాలనే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు అన్నది అర్ధమవుతుంది. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన ఇందుకు నిదర్శనంగా మారిపోయింది అని చెప్పాలి.



 శ్రీకాకుళం జిల్లా భామిని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏకంగా 95 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో గా సంచలనంగా మారిపోయింది. అయితే విద్యార్థులు ఇలా అస్వస్థతకు గురి కావడానికి అటు సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అని తెలుస్తోంది. అస్వస్థతకు గురైన విద్యార్థులందరినీ కూడా సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉంది అంటూ డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే వాంతులు చేసుకున్నారు విద్యార్థులు. కుళ్ళిన  కోడి గుడ్లు పెట్టడం కారణంగానే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. అయితే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలనే జగన్ ప్రభుత్వ లక్ష్యం గొప్పది అయినప్పటికీ పర్యవేక్షణ లోపం ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: