బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరీ దారుణంగా అబద్ధాలు చెబుతున్నారు. ఇంతకీ ఆయన తాజాగా చెప్పిన అబద్ధం ఏమిటంటే ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రప్రభుత్వం ఒప్పుకుందట. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతిని రాజధానిగా చెబితే కేంద్రం అందుకు అంగీకరించింది వాస్తవమే. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానులను ప్రతిపాదించారు. అయితే ఈ విషయమై టీడీపీ నేతలు+అమరావతి జేఏసీ నేతలు కోర్టులో కేసులు వేశారు. దాంతో మూడు రాజధానుల అంశం రాజకీయంగా వివాదమైపోయింది.




ఈమధ్యనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా హైకోర్టులో  కేసుని ఉపసంహించుకున్నది. తొందరలోనే మూడు రాజధానుల ప్రతిపాదనతో సమగ్రమైన బిల్లు తీసుకొస్తానని జగన్ అసెంబ్లీలోనే ప్రకటించారు. సరే గతంలో జరిగిన విషయానికి వస్తే మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. రాజధాని విషయంలో తన వైఖరి ఏమిటో అఫిడవిట్ రూపంలో చెప్పాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.




అప్పుడు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి సంబంధించినదే అని స్పష్టంగా చెప్పింది. మూడుసార్లు అఫిడవిట్లు వేయాలని చెప్పినా మూడుసార్లూ కేంద్రానికి సంబంధం లేదనే చెప్పింది. ఇక మరో అంశం ఏమిటంటే కేంద్రం-రాష్ట్రం మధ్య జరుగుతున్న కొన్ని ఉత్తర ప్రత్యుత్తరాల్లో హైదరాబాద్ నే రాజధానిగా కేంద్రం పేర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి కేంద్రమైనా, ఇంకెవరైనా ఏపీకి రాజధాని ఏదంటే అమరావతనే చెబుతారు.




ఎందుకంటే ఒకసారి రాష్ట్రప్రభుత్వం గెజిట్ లో అమరావతి రాజధానిగా పబ్లిష్ అయ్యింది కాబట్టి. భవిష్యత్తులో మూడు రాజధానుల ప్రతిపాదన అమల్లోకి వస్తే అప్పుడు జగన్ చెబుతున్నట్లు ఏపీ రాజధాని ఏదంటే అందరు వైజాగ్ అనే చెబుతారు. అప్పటివరకు అమరావతే రాజధాని అనటంలో సందేహమే లేదు. ఇంతోటిదానికి అమరావతినే కేంద్రం రాజధానిగా అంగీకరించిందని జనాలను తప్పుదోవ ఎందుకు పట్టిస్తున్నారో అర్ధం కావటంలేదు. బీజేపీ నేతలే ఒకపుడు జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులకు ఓకే చెప్పారు. అయితే తెరవెనుక ఏమి జరిగిందో ఏమో కొద్దిరోజుల తర్వాత అమరావతికే జై కొట్టారు.



 

మరింత సమాచారం తెలుసుకోండి: