ఇటీవల ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కథనాలు వస్తున్నాయి. రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీని ఎదురుకోగలవని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనాలు వేస్తున్నారు. అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే బెటర్ అనే అభిప్రాయం కొందరు టీడీపీ నేతలు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ళు పొత్తు ఉంటేనే బెటర్ అంటున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టులని కలుపుకుంటే బెటర్ అని చెబుతున్నారు.

మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ తాజాగా...టీడీపీ-జనసేన-కమ్యూనిస్టులు కలిసి వైసీపీని ఎదురుకోవాలని అన్నట్లు మాట్లాడారు. ఇక ఆయన అలా మాట్లాడటంతో టీడీపీలో వివిధ రకాల చర్చలు నడుస్తున్నాయి. బీజేపీతో పొత్తు ఉండదనే అభిప్రాయానికి వస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నష్టమే వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే బెటర్ అని చెబుతున్నారు.

అయితే పొత్తుల విషయాన్ని చంద్రబాబు ఇప్పుడు తేల్చేలా లేరు. అసలు పొత్తుల గురించి ఇప్పుడు చర్చలు చేయడానికి బాబు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇప్పటికే మీడియాకి ఆయన చెప్పేశారు..పొత్తుల గురించి ఇప్పుడు మాట్లాడటం ఊహాజనితమని, పొత్తుల గురించి స్పందించనని చెప్పేశారు. అంటే చంద్రబాబు మాటలు బట్టి చూస్తే...పొత్తుల గురించి ఇప్పుడు చర్చలు చేస్తున్నట్లు కనిపించడం లేదు.

కాకపోతే ఆయన పూర్తిగా టీడీపీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టినట్లు కనబడుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టాలనే ప్రక్రియలో బాబు ఉన్నారు. అసలు పొత్తులు గురించి ఆలోచించకుండా మొదట ఒంటరిగా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఈలోపు పొత్తుల గురించి మాట్లాడి జనసేనని పెద్దగా చేయాలనే ఆలోచనలో లేనట్లు ఉన్నారు. పొత్తుకు వెళితే జనసేన డిమాండింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకే ముందు పార్టీని బలోపేతం చేసి...సొంతంగా పోటీ చేయాలనే దిశగానే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కుదరని పక్షంలో అప్పుడు ఉండే పరిస్తితి బట్టి పొత్తుపై చర్చలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: