బ్రిటిష్ కాలం నాటి చట్టాలు బిక్కుబిక్కుమంటుంటే, కేంద్రం కొత్త సక్సెస్ లతో కొరడా ఝలిపిస్తోంది. న్యాయస్థానాన్ని చూస్తే గుండె ధైర్యంతో నిండిపోవాలి, న్యాయమే గెలుస్తుందని నమ్మకం రావాలి. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. న్యాయం లభించడం లేదా అంటే న్యాయం గెలుస్తుందన్న మాట కల్పితం. దీనికి ప్రధాన కారణం ఎప్పుడో బ్రిటిష్ కాలంలో రాసిన చట్టాలను ఇంకా అమలు చేయడం. నిజానికి ఎప్పటికప్పుడు చట్టాలను కూడా సవరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రం కూడా దీని మీదే నజర్ పెట్టింది.  ఐపిసి,సిఆర్ పిసి లో సవరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

అదే జరిగితే ఎలాంటి మార్పులు చూడబోతున్నాం. క్రిమినల్ ప్రొసీజర్ పైనే దృష్టి సారించారా? ఇక సామాన్యుడికి న్యాయం ఇజీగా దొరికేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి ఎంపీలందరి సూచనలను కోరుతూ లేఖలు రాశారు. కేంద్రం అందరికీ సత్వర న్యాయం జరిగేలా కట్టుబడి ఉందంటూ ఈ లేఖలో తెలిపారు. ముఖ్యంగా బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఈ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సత్వర న్యాయం చేకూరేలా చేయాలనేటటువంటి లక్ష్యంతో ఉన్నామన్నారు. ప్రధాన న్యాయమూర్తి,హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్య మంత్రుల నుంచి సూచనల్ని అభ్యర్థించడంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, బార్ కౌన్సిల్ లు మరియు విశ్వవిద్యాలయాలు తమ సూచనలను పంపవల్సిందిగా లేఖలో అమిత్ షా కోరారు.

 నిజానికి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పులు తీసుకురావాలనే ఆలోచన ఇప్పటిది కాదు, ఎల్.కే. అద్వానీ హోం మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. మహిళలు, చిన్నారులు, బడుగు బలహీన వర్గాలకు సత్వర న్యాయం జరిగేలా చట్టాల్లో సవరణలు తీసుకురావాలన్నది కేంద్రం లక్ష్యం. బ్రిటిష్ కాలం నాటి విధానాల్లో మార్పులు తీసుకురావాలని అనుకోవడం కేంద్రాన్ని కచ్చితంగా మెచ్చుకోవల్సిన అంశమే.

మరింత సమాచారం తెలుసుకోండి: