అవును బాబు ఉంటే బాగుండేది...రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండేది. అసలు ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండేవి కాదు. కానీ బాబు లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు..జగన్ పాలనతో రాష్ట్రం నాశనమైపోయింది. ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయింది..జగన్ పాలనలో ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు అనుకునేది...అనుకోవడం ఏముంది...గత రెండున్నర ఏళ్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు.

తాజాగా కేంద్ర బడ్జెట్ సమావేశాలపై కూడా తమ్ముళ్ళు పోస్టులు వేస్తున్నారు..జీరో సీఎం రాష్ట్రానికి సాధించింది జీరో అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే వైసీపీ ఎంపీలంతా జీరోలే అంటూ పోస్టులు చేస్తున్నారు. అవును తమ్ముళ్ళు చెప్పే దానిలో కూడా నిజముందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి 22 మంది లోక్‌సభ ఎంపీలు, 6 గురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు..మొత్తం 28 మంది ఎంపీలు ఉన్నారు...ఇంతమంది ఉన్నా సరే రాష్ట్రానికి ఏమి సాధించలేకపోయారు. అసలు తమకు కావాల్సిన అంశాలని కేంద్రం దగ్గర డిమాండ్ చేశారా? లేదా? అనేది కూడా తెలియడం లేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు నిధులు సాధించలేకపోయారు. అందుకే వైసీపీ ఎంపీలపై తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు. సరే వైసీపీ ఎంపీలు ఏం సాధించలేకపోతున్నారు. మరి గతంలో బీజేపీతో పొత్తులో ఉండి..టీడీపీ సాధించింది ఏంటి? రాష్ట్రానికి తెచ్చింది ఏంటి? అనేది చూసుకున్న కూడా ఏమి లేదని చెప్పొచ్చు. పైగా ప్రత్యేక హోదా కూడా పోయేలా చేశారు.

అలాగే చంద్రబాబు పాలనలో తమకు ఒరిగింది ఏమి లేదనే ప్రజలు....జగన్‌ని గెలిపించుకున్నారు...ఆ విషయం తమ్ముళ్ళు మరిచిపోయి, బాబు ఉంటే బాగుండేది...అది పొడిచేసేవారు...ఇది పొడిచేసేవారు అని మాట్లాడుతున్నారు. అలాగే అప్పుడు రాష్ట్రంలో అన్నిటిల్లో నెంబర్ 1 పొజిషన్‌లో ఉందని, ఇప్పుడు రాష్ట్రం అన్నివిధాలుగా వెనుకబడిపోయిందని మాట్లాడుతున్నారు. వాస్తవానికి చూసుకుంటే చంద్రబాబు, జగన్ పాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమి లేదని చెప్పొచ్చు. అటు కేంద్రం కూడా సాయం అందించడంలో విఫలమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp