కేంద్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైట్ కొనసాగిస్తూనే ఉన్నరన్న సంగతి తెలిసిందే.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై దూకుడు పెంచుతున్నారు. తెలంగాణ నుంచి దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కేంద్రంగా రైతు, విద్యుత్ ఉద్యమాన్ని నడపాలన్నారు కేసీఆర్. ఈ నెల 12, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రైతు సంఘం నాయకుడు తికాయత్ కూడా సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నెల మూడో వారంలో హైదరాబాద్‌లో విద్యుత్‌ సంఘాలతో సమావేశం కానున్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఏప్రిల్ లో సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


కేంద్రంపై పోరాటానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమ తా బె నర్జీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కూడా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతోంది. మహారా ష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ నేత శరద్ పవార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌లను కలిశారు. కేంద్ర విధానాలకు వ్యతి రేకంగా టీఆర్‌ఎస్‌ చే స్తున్న పోరాటాలకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ కోరారు.ఈ నెల 12, 13 తేదీల్లో దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో సదస్సు నిర్వహించేం దుకు సిద్ధమ య్యారు. రైతు సంఘం నాయకుడు తికాయత్ కూడా సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ నెల మూడో వారంలో… ఈ సభ ఉం డే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ సభలో సీఎం కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి:

trs