తల్లితండ్రులకు మరో కీలక వార్త .... విద్యాసంస్థల ఓపెనింగ్ మళ్ళీ వాయిదా పడింది. సెలవు మరో రోజుకు పొడిగించబడింది. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ లో చదువుతున్న విద్యార్దులకు సంబందించినది. వివరాలు ఇలా ఉన్నాయి.
తాజా సమాచారం మేరకు ఏపిలోని పాఠశాలకు సెలవులను మరొక రోజు పొడిగించడం జరిగింది. స్వయంగా అధికారులే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే నిర్ణయించిన  షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 4వ తేదీన ప్రారంభం కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు తాజాగా దానిని మరో రోజుకు పొడగించారు విద్యాశాఖ అధికారులు. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ఇప్పటికే పాఠశాలలకు విషయాన్ని పాస్ చేయడం జరిగింది.

వచ్చే నెల జూలై 4 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో పర్యటన ఫిక్స్ చేశారు. దాంతో ఇపుడు  ఒకరోజు ఆలస్యంగా స్కూల్స్ ఓపెన్ చేయడం మంచిది అని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రైవేట్, గవర్నమెంట్ పాఠశాలలకు ఉత్తర్వులు జారీచేసింది. జూలై 4 న పాఠశాలలు పున:ప్రారంభం ఇపుడు మరో రోజుకు వాయిదా పడిందని జూలై 5 నుండి స్కూల్స్ రీవోపెన్ చేయాలని సూచించారు.  మంగళగిరి పరిధిలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌ను వచ్చే నెల 5 వ తేదీ ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇపుడు మరొక రోజు సెలవు ప్రకటించడం జరిగింది.

ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు అధికారులు. విశాఖపట్టణం, భీమవరం, గుంటూరు జిల్లాలో పిఎం పర్యటించపోతున్నట్లు సమాచారం. ప్రధాని పర్యటన ఉన్నందునే ఒకరోజు ఆలస్యంగా స్కూల్ ఓపెన్ కానున్నాయి.
ఇక పిఎం పర్యటన విశేషాలు ఇలా ఉన్నాయి.... ముందుగా ప్రధాని ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో బీజేపీ తరపున బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడ మోడీ పలు కీలక వ్యాఖ్యలు వెల్లడించనున్నారు అని సమాచారం. తర్వాత భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పిఎం పాల్గొనేందుకు  ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి. మోడీ పర్యటన నేపథ్యం లోనే ఇపుడు స్కూల్ రిఓపెనింగ్ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ పర్యటన ముఖ్య కారణం ఎన్నికలు అని తెలుస్తోంది.

నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కానీ అధికార పార్టీ నుండి ప్రత్యర్ధి పార్టీల వరకు అన్ని కూడా ఇప్పటి నుండే రూట్ క్లియర్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఎలక్షన్స్ కు దాదాపు రెండేళ్ల సమయం ఉన్నప్పటికి.. రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలో  బీజేపీ కూడా అలెర్ట్ అయ్యింది. అంతే కాకుండా  తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశాయి. ఎందుకంటే నిజానికి బిజెపి కి తెలుగు రాష్ట్రాల్లో పట్టు తక్కువ. ముఖ్యంగా ఏపిలో అసలు బీజీపీ ఉనికి చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే ఈసారి ఎన్నికల కంటే ముందే ఏపిలో బీజీపీ స్ట్రాంగ్ అవ్వాలని గట్టిగానే నిర్ణయించుకున్నారు కమలనాథులు. ముఖ్యంగా బిజెపి పార్టీ సారధి నరేంద్ర మోడీ.   తెలంగాణ పర్యటన ముగిసిన వెంటనే మోడీ ఏపీలో అడుగు పెడతారు. కాగా కేంద్రమంత్రులు సైతం ఈ సభలలో పాలుపంచుకున్నారు.   ఏపి, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో బీజేపీకి అంతగా ఓటుబ్యాంకు లేదు అన్న విషయం తెలిసిందే. కానీ ఇపుడు పార్టీ విస్తరణలో కచ్చితంగా వేగం పెంచాలని ఉద్దేశంతోనే ఈ పర్యటనను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: