కేసీయార్ భవిష్యత్తుపై తెలంగాణా గవర్నర్ తమిళిసై జోస్యం చెప్పేశారు. మామూలుగా అయితే ముఖ్యమంత్రుల వ్యక్తిగత విషయాలపై గవర్నర్లు ఏమీ మాట్లాడరు. సీఎం పరిపాలనా తీరును, వ్యక్తిగత విషయాలను ప్రతిపక్షాలు, మీడియా టార్గెట్ చేయటమే ఇప్పటివరకు అందరు చూసింది. కానీ విచిత్రంగా గవర్నర్ కేసీయార్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ మీడియాతో మాట్లాడుతు రెండు విషయాలను ప్రస్తావించారు.





మొదటిదేమంటే కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళరని చెప్పారు. నిజంగా ఈ విషయం గవర్నర్ ప్రస్తావించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ముందస్తుకు వెళ్ళటం వెళ్ళకపోవటం పూర్తిగా కేసీయార్ ఇష్టమే. ఇందులో గవర్నర్ ప్రమేయం ఏమీవుండదు. అయినా కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళరని ఎందుకు చెప్పారో అర్ధం కావటంలేదు. కొంతకాలంగా తెలంగాణాలో ముందస్తున్న ఎన్నికలపై పెద్దఎత్తున గోల జరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే.





ఇక రెండో విషయం ఏమిటంటే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించినా కేసీయార్ రాణించలేరట. అసలు జాతీయ రాజకీయాల్లోకి కేసీయార్ ప్రవేశించరని, ఒకవేళ ప్రవేశించినా రాణించలేరని జోస్యం చెప్పటం సంచలనంగా మారింది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించటం కేసీయార్ ఇష్టమే. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేవారంతా రాణిస్తారని గ్యారెంటీలేదు. రాణించేందుకు ఉన్న అవకాశాలపై ఎలాంటి అధ్యయనం చేయకుండానే కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని ప్లాన్ చేసుంటారా ? అయినా కేసీయార్ జాతీయరాజకీయాల్లోకి ప్రవేశించటం, రాణిస్తారా లేదా అన్నది నూరుశాతం కేసీయార్ ఇష్టం. ఇందులో గవర్నర్ మాట్లాడాల్సిన అవసరమేలేదు.






పైగా నరేంద్రమోడీకి వ్యతిరేకంగానే కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకుంటున్నారని వ్యాఖ్యలు చేయటమే విచిత్రంగా ఉంది. కేసీయార్ గురించి గవర్నర్ చెప్పిన జోస్యం సంచలనంగా మారింది. తాజాగా గవర్నర్ వ్యాఖ్యలు చూసిన తర్వాత తమిళిసై తన పరిధిని దాటారనే అనుమానాలు పెరుగుతున్నాయి. అనవసరమైన విషయాలను మాట్లాడటంలో భాగంగా కేసీయార్ ను వ్యక్తిగతంటా టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు కేసీయార్ అయితే గవర్నర్ వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ టార్గెట్ చేసినట్లు లేదు. అలాంటిది గవర్నర్ కు మాత్రం అంత అవసరం ఏమొచ్చిందో అర్ధం కావటంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: