జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా బీజేపీ గ్రిప్‌లోకి వెళ్లిపోయారా? అంటే ప్రస్తుత పరిస్థితులని చూస్తే అవుననే అనుమానం రాక మానదు. ఎందుకంటే పవన్‌కు అంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. పవన్ ఎన్నికల్లో ఓటమి పాలైన, ఆయన అంటే అభిమానించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. అలాగే పవన్ ఏదైనా సమస్య మీద స్పందిస్తే, అది పాలకులు త్వరగా పరిష్కరిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంది. ఓట్లు వేయకపోయిన సరే జనసేన పార్టీ అంటే ప్రజలకు ఓ మంచి నమ్మకమే ఉంది.