ఎన్నికల్లో నెగ్గేందుకు వైపాకా నేతలు కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే కొందరు నేతలు విపక్ష సభ్యులను ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్లను వెనక్కి తీసుకుంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్నీ రకాల సహకారాలను అందిస్తామని చెబుతున్నారు. పలమనేరు పరిధిలో ఇప్పటికే 10 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలినవి చేసేందుకు యత్నిస్తున్నారు.