ఏపీలో మంత్రివర్గంలో మార్పులు చేయడానికి ముహూర్తం దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. మరో ఆరు నెలల్లో జగన్ మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశముంది. ఇప్పుడున్న మంత్రివర్గంలో మార్పులు చేసి కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. ఇక జగన్ కేబినెట్లో ఛాన్స్ కొట్టేయాలని పలువురు సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలు చూస్తున్నారు. అలాగే తమ పదవులని నిలబెట్టుకోవాలని ఉన్న మంత్రులు ప్రయత్నిస్తున్నారు.