ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగన్ గత ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సీట్లు గాని, పార్లమెంటు సీట్లు గాని అత్యధికంగా గెల్చుకున్నారు. కానీ రాష్ట్రంలో వైసీపీకి పూర్తిగా అనుకూల పరిస్థితులు ఉన్నా సరే కేంద్రంలో మాత్రం వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ 22 ఎంపీలు గెలుచుకున్నా సరే పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. కేంద్రంలో బిజెపికి మంచి మెజారిటీ ఉండడంతో జగన్ అనుకున్న పనులు కావడం లేదు.