మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 65ఏళ్లు గడిచిపోయాయి. 66వ ఏట అడుగుపెట్టినా ఎక్కడేసిన గోంగళి అక్కడే ఉంది. నిత్యం పేదోళ్లు పెరుగుతూనే ఉన్నారు. మహనీయులు కళలుగన్న గ్రామస్వారాజ్యం పత్తాలేకుండా పోయింది. అభివృద్ధిమాట అలా ఉంచితే, దేశంలో రోజురోజుకు అవినీతి, ఉగ్రవాదం పెరిగిపోతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో మళ్లీ గాంధీజీ పుట్టాలేమో అనిపిస్తోంది. గత 65 సంవత్సరాలుగా ఆగస్టు 15వ తారీఖును స్వాతంత్ర్యదినోత్సవంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ రోజు వాడవాడలా మువ్వన్నెల జెండానుఎగురవేస్తున్నాం. అయితే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందా అంటే జవాబు మాత్రం టక్కుమని రాదు. గాంధీజీ కళలు కన్న స్వాతంత్ర్యం రాలేదనే చెప్పాలి. మహిళలు అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు అన్న ఆయనమాటలు గుర్తు చేసుకుంటే మాత్రం మనకు ఇంకా స్వాతంత్ర్యం వచ్చినట్టు లేదు.  గాంధీజీ అర్థరాత్రే అన్నారేగానీ నేడు మహిళలు పగటిపుటనే రోడ్లపై తిరుగలేక పోతున్నారు. ఇదేనా మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు? వందనోటు, మదుసీసా లేకుండా ఎన్నికలు జరుపుకోలేని దౌర్భగ్యస్థితిలో మనం ఉన్నాం. తెల్లోడి నుండి మనం స్వాతంత్ర్యం తీసుకుని ఏం సాధించాం?. మన పాలనలో జాతీయ ప్రసంగాలు సైతం తూటాల మధ్య జరుపుకుంటున్నాం.  అన్నీ వనరులున్నా రవాణా రంగం, విద్యా, విద్యుత్ రంగాలు అద్వానంగా ఉన్నాయి. గత 65ఏళ్లగా (స్వాతంత్ర్యదినోత్సం రోజు) పాలకులు చెప్పిన మాటలనే పదేపదే చెప్పుతున్నారు. అభివృద్ధి చెందుతున్నాం అంటారేగాని, అభివృద్ధి చెందామని నేటికీ చెప్పరు. ఏప్పటి లాగే ఈసారీ ఆగస్టు 15నును ఘనంగా జరుపుకుంన్నాం. 12వ పంచవర్షిక ప్రనాళికలో భారతదేశం ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించామని మన పాలకులు లెక్కలేస్తూ ప్రసంగిస్తారు.కానీ అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పతనమై పోతూనే ఉంది. డాలర్ విలువలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నాళిలా? పేదలుపేదలుగానే మిగిలిపోతున్నారు. అభివృద్ధి అనే విషయం నేతల ప్రసంగాలకే పరిమితమవుతున్నాయి. వాగ్దానాలు గాలిలో కలుస్తున్నాయి. తెల్ల దొరలు పోయి... నల్ల దొరలు వచ్చారు. సెల్ ఫోన్లు, బంగారం,క్రెడిట్ కార్డులతో అభివృద్ధి సాధించినట్లుకాదు. పేదోడికి కనీసం కూడు,గుడ్డ అందినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు.  ఏ పార్టీపాలన చూసినా సంక్షేమాలు కాగితాలకే పరిమిత మవుతున్నాయి. ఉపాధిలేక యువతరం రోడ్డున పడుతోంది. తెల్లదోరలు వీడినా మనకు బానిస సంకెళ్లు ఇంకా పోలేదు. పాలకుల నిర్లక్ష్యంతో ప్రజల నిధులు పక్కదారి పడుతున్నాయి. దీంతో లక్ష్యలకోట్లు అవినీతి నీడలోకి పారిపోతున్నాయి. గరీబీ హటావో నినాదం పోయి.. స్వీస్ బ్యాంక్ బరావో నినాదం నాయకుల మదిలో మెదులుతోంది. స్వదేశంలో విదేశీ పరిశ్రమలు వెలుస్తున్నాయి. దీంతో మన పరిశ్రమల ఉనికి కానరాకుండా పోతోంది. మన నాయకులు తెల్లారి లేస్తే తమ ఉనికిని కాపాడుకునేందుకే సమయం సరిపోతోంది.ఇక పేద ప్రజల గోడు ఎవరింటారు. మన ఆర్థిక వ్యవస్థ ఎటుపోతుందో అర్థంకాని స్థితిలో ఉంది. పేదోడికి అందనంత దూరంలో వైద్యం పారిపోయింది. ఓట్లకోసం ఉచిత పథకాలు ఉన్నంతకాలం దేశ అభివృద్ధి శూన్యం. ఓటు బ్యాంక్ రాజ్యకీయాలు పోవాలి? మార్పు రావాలి? ప్రజలను మభ్యపెట్టేందు పాలకులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దీర్ఘకాలిక పరిష్కారంకాదని ప్రజల్లో చైన్యం తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపౌరుడిపై ఉంది. పేదలకుదీర్ఘకాలిక పరిష్కారం చూపాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ఈ సమాజంలో ధనవంతులు మరింత ధనవంతలుగా మారుతుంటే, పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. మహనీయులు సాధించిన స్వాతంత్ర్య ఫలాలు మనకు అందాలంటే అదరం నడుంబిగించాలి.  అభివృద్ధికి పాటుపడాలి... అంతరించిపోతున్న మన సంస్కృతిని కాపాడుకోవాలి. కుల్లిన రాజకీయాలను ఎదురించాల్సిన బాధ్యత మనందరిపైనుంది. కుల,మతాలకు అతీతంగా అభివృద్ధి సాధించినప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు......

మరింత సమాచారం తెలుసుకోండి: