జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  తాజాగా చెప్పిన మాట‌లు చాలా కామిడీగా ఉంది.  పార్టీ త‌ర‌పున ఐటి సెంట‌ర్ ప్రారంభించిన  సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ తాను పాతికేళ్ళ రాజ‌కీయానికి సిద్ధ‌ప‌డే వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ప‌ట్టుమ‌ని నాలుగు రోజులు కూడా ప్ర‌జ‌ల్లో తిర‌గ‌లేని వ్య‌క్తి పాతికేళ్ళ రాజ‌కీయం గురించి మాట్లాడితే ఎవ‌రైనా న‌మ్ముతారా ? అదే సంద‌ర్భంగా జ‌న‌సేన‌కు 10 ల‌క్ష‌ల స‌భ్య‌త్వ‌మున్న‌ట్లు చెబుతూనే 2 కోట్ల‌మంది భాగ‌స్వాముల‌ను చేయ‌నున్న‌ట్లు చెప్ప‌టం విచిత్రంగా ఉంది. 


ముందుకు వెన‌క్కు

Image result for pawan kalyan praja yatra

రాజ‌కీయాల్లో  పాతికేళ్ళు ఉండేందుకే సిద్ధ‌మై వ‌చ్చిన‌ట్లు చెబుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కున్న ఓపికేంటో అంద‌రికీ తెలిసిందే.  మొద‌లుపెట్టిన ప్ర‌జా పోరాట యాత్ర  ఎంత దివ్యంగా జ‌రుగుతోందో అంద‌రికీ తెలిసిందే.  ప‌ర్య‌ట‌న  మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర నుండి  రెండు రోజులు యాత్ర నాలుగు రోజుల విశ్రాంతి అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెన‌క్కు అన్న‌ట్లుగా సాగుతోంది. ఇంకోవైపు జ‌గ‌న్ మొద‌లుపెట్టిన పాద‌యాత్ర ఆరునెల‌లుగా విరామం లేకుండా సాగుతూనే ఉంది. శుక్ర‌వారం కోర్టుక‌ని లేక‌పోతే వ‌ర్షాల వ‌ల్ల అంత‌రాయం త‌ప్పితే జ‌గ‌న్ తీసుకున్న విశ్రాంతి అన్న‌దే లేదు. ప‌ట్టుమ‌రి నాలుగు రోజులు కూడా ఏక‌బిగిన యాత్ర చేయ‌లేని వ్య‌క్తి పాతికేళ్ళ రాజ‌కీయం చేస్తానంటే ఎవ‌రైనా న‌మ్ముతారా ?


పార్టీ సభ్య‌త్వాలెన్ని 

Image result for janasena membership card

ఇక‌, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం గురించి మాట్లాడుకుందాం.  ఇప్ప‌టికి 10 ల‌క్ష‌ల మంది స‌భ్య‌త్వం తీసుకున్న‌ట్లు చెప్పారు. అలాగే 2 కోట్ల‌మందిని భాగ‌స్వాముల‌ను చేయాల‌న్న‌ది ల‌క్ష్య‌మ‌న్నారు. స‌భ్య‌త్వ‌మంటే అర్ధ‌ముంది. మ‌రి భాగస్వామ్య‌మంటే ఏంటో ప‌వ‌నే చెప్పాలి. అస‌లు స‌భ్య‌త్వాలు కూడా స‌క్ర‌మంగా జ‌ర‌గ‌టం లేద‌ని అంటున్నారు. ఎలాగంటే త‌న అభిమాన సంఘాల్లోని స‌భ్యుల‌నే పార్టీ స‌భ్య‌త్వాలుగా ప‌వ‌న్ చెబుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. పార్టీ స‌భ్య‌త్వం వేరు అభిమాన సంఘాల్లో స‌భ్య‌త్వం వేర‌న్న విష‌యం ప‌వ‌న్ కు తెలుసో తెలీదో ?  అభిమాన సంఘాల్లో స‌భ్య‌త్వం ఉన్న వారంతా పార్టీ స‌భ్య‌త్వం తీసుకోవాల‌ని లేదు.  అభిమాన సంఘాల‌కు సంబంధం లేని వారు స‌భ్యులుగా చేరితేనే  పార్టీ బ‌లోపేత‌మ‌వుతుంది. 


కార్య‌వ‌ర్గం ఏర్పాటుకు ఎంత కాలం అవ‌స‌రం ?  


చివ‌ర‌గా పార్టీ నిర్మాణం గురించి మాట్లాడుతూ, రాత్రికి రాత్రే పార్టీ  నిర్మాణం సాధ్యం కాద‌ని ప‌వ‌న్ చెప్ప‌టం విచిత్రంగా ఉంది. ప‌వ‌న్ చెప్పింది ఒక‌ర‌కంగా నిజ‌మే కావ‌చ్చు. కానీ జ‌న‌సేన‌ను ప‌వ‌న్ ఏర్పాటు చేసి ఇప్ప‌టికి 5 ఏళ్ళ‌యిందన్న విష‌యం మ‌ర‌చిపోకూడ‌దు. ఐదు సంవ‌త్స‌రాల్లో క‌నీసం పార్టీ కార్య‌వ‌ర్గాన్ని కూడా ఏర్పాటు చేయ‌లేక‌పోయారంటే  ప‌వ‌న్ వైఫ‌ల్య‌మనే చెప్పాలి.  ఒక‌వైపు ఎన్నిక‌లు ముంచుకువ‌స్తున్నా ఇంకా పార్టీ నిర్మాణం గురించి ఆలోచించ‌టం లేదంటేనే  ఆశ్చ‌ర్యంగానే ఉంది.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: