కొన్నినెలలుగా జీడిపాకం సీరియల్ గా సాగుతున్న కర్ణాటక రాజకీయం కథ నేడు దాదాపు క్లయిమాక్స్ కు చేరబోతోంది. మొన్ననే కుమార స్వామి ప్రభుత్వం పడిపోయిన సంగతి తెలిసిందే. గవర్నర్ సూచన మేరకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.


ఇప్పుడు ఆయన అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. సరిగ్గా ఇలాంటి కీలకమైన సమయంలో స్పీకర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక రాజకీయాలలో మరో ట్విస్ట్ కు తెర తీశారు. యడ్యూరప్ప అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో స్పీకర్ రమేష్ కుమార్ నిర్ణయం తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది.


స్పీకర్ అంటే కేవలం సభను ఆర్డరులో పెట్టడానికి ,అధికార ప్రతిపక్ష సభ్యుల కు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి, సభలో గొడవ పెట్టిన వారిని సభ నుంచి బహిష్కరించడ౦ మాత్రమే స్పీకర్ అనుకుంటే పొరపాటు . స్పీకర్ కు విస్తృత అధికారాలు ఉన్నాయి. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు కోర్టులకు కూడా లేదు. ఇది చాలా సార్లు రుజువైంది.


కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలు 14 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేశారు..ఆ 14 మంది 2023 వరకు పోటీ చేయడానికి వీలు లేకుండా..అనర్హత ప్రకటించారు అంతే కాదు రేపు బలపరీక్షకు అసెంబ్లీ కి రావడానికి వీలు లేకుండా చేశారు.. దీనికి ముందు ముగ్గురు పై వేటు వేశారు..మొత్తం కర్ణాటక అసెంబ్లీ లో 17 మంది శాసనసభ్యులు అనర్హత లో 207 సంఖ్య కర్ణాటక అసెంబ్లీ శాసనసభ్యుల్లో మ్యాజిక్ ఫిగర్ 105 కాగా యడ్యూరప్పకు బిజెపికి 105 మంది ఉన్నారు..యడ్యూరప్ప నూటికి 99 శాతం బలపరీక్షలో గెలిచే తీరుతారు అందులో సందేహం లేదు. అయితే అనర్హత వేటు పడ్డ శాసన సభ్యులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. వీరి పిటిషన్ పై కోర్టు ఏం చెబుతుందేనేది కూడా ఆసక్తికరమే. ఈ నేపథ్యంలో కర్ణాటక స్పీకర్ రమేష్ తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: