ఈ నెల 1వ తేదీ నుండి కొత్త మోటారు వాహనాల చట్టం అమలులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ చట్టం ఇప్పటివరకు అమలులోకి రాకపోయినా చాలా రాష్ట్రాల్లో మాత్రం ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక వాహనదారులకు భారీగా జరిమానాలు పడుతున్నాయి. కొందరి విషయంలో వాహనం విలువ కన్నా జరిమానానే అధికంగా ఉందని కూడా తెలుస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డ్రస్ కోడ్ పాటించని లారీ డ్రైవర్లకు కూడా జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైనా డ్రైవర్లు లుంగీతో డ్రైవింగ్ చేస్తే 2,000 రుపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వాణిజ్య వాహనాలను నడిపే డ్రైవర్లు ఖచ్చితంగా డ్రస్ కోడ్ పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం లారీ డ్రైవర్లు ప్యాంటు షర్టుతో పాటు యూనిఫామ్ కూడా ధరించాల్సి ఉంటుంది. 
 
గతంలో కూడా ఈ నిబంధన ఉండేదని అప్పుడు 500 రుపాయలు జరిమానా చెల్లించాల్సి ఉండేదని కొత్త మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాను 2,000 రుపాయలకు పెంచారని తెలుస్తోంది. భారీ జరిమానాలు పడుతూ ఉండటంతో కొన్ని చోట్ల వాహనాలను వదిలేసి వెళ్ళిపోవటం, వాహనాలను కాల్చేయటం లాంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. 
 
ఒడిసాలోని అశోక్ జాదవ్ అనే ట్రక్కు డ్రైవర్ కు ట్రాఫిక్ పోలీసులు 86,500 రుపాయలు జరిమానా విధించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాలలో ఈ జరిమానా అత్యధికం కావటం విశేషం. చాలా నిబంధనలను ఉల్లంఘించటంతో అశోక్ జాదవ్ కు ఇంత భారీ మొత్తంలో జరిమానా పడిందని తెలుస్తోంది. ఐదు గంటల సమయం పాటు అశోక్ జాదవ్ ట్రాఫిక్ పోలీసుల్ని వేడుకొంటే జరిమానాను 70,000 రుపాయలకు తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జరిమానాలను తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


 



మరింత సమాచారం తెలుసుకోండి: