ఏదైనా అవసరం కోసం రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ఎన్నో రూల్స్ చెబుతారు.. కండీషన్లు పెడతారు. కానీ ఈనెల 3 నుంచి 7 వరకూ మాత్రం అలా ఉండదు.. బ్యాంకు వాళ్లే మీకు సాధ్యమైనంత వరకూ లోన్ వచ్చేలా చేస్తారు. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఈనెల 3 నుంచి 7 వరకూ రుణ మేళాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకులను ఆదేశించింది.


ప్రతి బ్యాంక్‌ ఖాతాదారునికి వివిధ రుణ పథకాలను అందించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ఈ పథకాలు అమలు చేస్తారు. ఫస్ట్ ఫేజ్‌లో ఏపీలోని 10 జిల్లాలు ఎంపికయ్యాయి.

ఈ జిల్లాల్లో ప్రధాన నగరాల్లో అక్టోబరు 3నుంచి 7వరకూ రుణ మేళాలు నిర్వహించనున్నారు.ఈనెల 3, 4 తేదీల‌లో కాకినాడ.. 3, 6 తేదీల్లో చిత్తూరు, తిరుపతి.. 3, 7 తేదీల్లో మచిలీపట్నం, విజయవాడ.. 4, 5 తేదీల్లో ఏలూరు, కర్నూలు, కడప.. 5, 6 తేదీల్లో విశాఖపట్నం, గుంటూరు..5, 7 తేదీల్లో ఒంగోలు.. 6, 7 తేదీల్లో నెల్లూరులోనూ ఈ రుణ మేళాలు నిర్వహిస్తారు. ప్రతి బ్యాంకు తన ఖాతాదారుల కోసం ఈ రుణ మేళాలు నిర్వహిస్తారు. మీరు మీ ఖాతా ఉన్న బ్యాంకుకు వెళ్లి ఈ లోన్ మేళా వివరాలు తెలుసుకోవచ్చు.


ఖాతాదారులకు మరింత చేరువగా బ్యాంక్‌ రుణ పథకాలు’ అనే నినాదంతో ఈ లోన్ మేళా సాగుతాయి. ‘ముద్ర’రుణాలతో పాటు విద్య, గృహ, వాహన, పారిశ్రామిక, వ్యవసాయ, వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తారు. ఖాతాదారునికి ఏ రుణం కావాలంటే ఆ రుణం ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కూడా నిర్ణయించింది. సో.. ఇక రుణాల పండుగ చేసుకోండి. బెస్టాఫ్ లక్.


మరింత సమాచారం తెలుసుకోండి: