తెలుగుదేశంపార్టీలో ఆత్మ
లోపించిందా ? పార్టీకి ఆత్మ ఏమిటి ? ఏమిటంటే సిద్ధాంతాలట. ఎన్టీయార్ హయాంలో ఉన్న
సిద్ధాంతాలు ఇపుడు లోపించాయంటున్నాడు వీరేందర్ గౌడ్. పార్టీకి సిద్ధాంతాలు
లేకపోవటమంటే ఆత్మ లోపించటమేనట. అందుకే తాను తెలంగాణా తెలుగుయువత పదవికి, పార్టీకి
రాజీనామా చేస్తున్నట్లు బహిరంగ లేఖలో చెప్పాడు లేండి.
ఇంతకీ తూళ్ళ వీరేందర్ గౌడ్ ఎవరంటే మాజీ హోంశాఖ మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్ కొడుకే లేండి. వీరేందర్ రాజీనామా చేయటం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే తూళ్ళ కుటుంబం చాలా కాలంగా బిజెపితో టచ్ లో ఉన్నది. రేపో మాపో బిజెపిలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.
అసలు టిడిపి రాజ్యసభ ఎంపిగా పదవీకాలం అయిపోయిన దగ్గర నుండి దేవేందర్ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించటం లేదు. పైగా ఢిల్లీలో బిజెపి అగ్ర నేతలతో భేటి కూడా జరిగింది. దాంతో దేవేందర్ కుటుంబం బిజెపిలో చేరటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. అయితే దేవేందర్ కాకుండా ముందుగా కొడుకు వీరేందర్ రాజీనామా చేయటమే కాస్త ఆశ్చర్యంగా ఉంది.
నిజానికి దేవేందర్ కుటుంబం రాజకీయంగా దాదాపు కనుమరుగైపోయిందనే చెప్పాలి. సమైక్య రాష్ట్రంలోనే దేవేందర్ కుటుంబం తన ప్రాభవాన్ని కోల్పోయింది. కారణం ఏమిటంటే తీవ్ర అస్ధస్ధత. దేవేందర్ చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. దాంతో యాక్టివ్ రాజకీయాలకు దూరమైపోయారు.
సొంత పార్టీ పెట్టుకుని 2009లో ఎంపి, ఎంఎల్ఏగా పోటి చేసినపుడే ఆయన సత్తా ఏంటో తేలిపోయింది. పోటి చేసిన రెండు చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. ఆ ఎన్నికలతో దేవేందర్ కున్న ఇమేజ్ ఏంటో తెలిసిపోయింది. అప్పటి నుండే పొలిటికల్ గా డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందనే చెప్పాలి. తర్వాత అనారోగ్యం, రాష్ట్ర విభజన లాంటి అనేక కారణాలతో రాజకీయంగా కనుమరుగైపోయారు. అలాంటి దేవేందర్ గౌడ్ కొడుకు కూడా టిడిపికి ఆత్మ లోపించిందని చంద్రబాబును దెప్పి పొడుస్తుండటమే విచిత్రంగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి