తమిళనాడులో అతిపెద్ద  ప్రతిపక్ష పార్టీ అయిన  ద్రవిడ మున్నేట కజగం (డిఎంకె) దాఖలు చేసిన దరఖాస్తును డిసెంబర్ 5 న సోమవారం  విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.  స్థానిక అధికారులను స్థానిక సంస్థ ఎన్నికలకు,  ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే ముందు, డీలిమిటేషన్, రిజర్వేషన్లు, భ్రమణ ప్రక్రియ మరియు రాష్ట్రంలో రూపొందించిన ఐదు కొత్త  జిల్లాలను పరిగణనలోకి తీసుకొవాలని కోర్టు ఆదేశించింది.

 

 

భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ ఎ. బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరైన సీనియర్ న్యాయవాది ఎ.ఎం. సింగ్వి డిసెంబరులో ఎన్నికలు జరగనున్నందున  ఈ  దరఖాస్తు యొక్క అత్యవసరతను  వివరించారు.  నవంబర్ 18 న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని మరియు తదుపరి విచారణ తేదీ అయిన డిసెంబర్ 13 లోపు చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది.

 

 

డిఎంకె కోర్టులో సమర్పించిన పిటిషన్ లో, ఎన్నికల నోటిఫికేషన్ మరియు ఎన్నికలను నిర్వహించడానికి ముందు డీలిమిటేషన్, రిజర్వేషన్,  రొటేషన్ ప్రక్రియ మరియు అన్ని అధికారిక  చట్టపరమైన అవసరాలను నిర్వహించడానికి ప్రతివాదులకు కోర్టు  ఆదేశాలు జారీ చేయాలి,  ఇది మాత్రమే ఎన్నికల పై ఎవరి ప్రభావం లేకుండా  ఎన్నికలు సజావుగా జరిగేటట్టు చూస్తుంది  అని పేర్కొన్నారు.

 

 

2018 లో పూర్తయిన డీలిమిటేషన్ ప్రక్రియకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని  రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.  ఈ ఎన్నికలు 2016 నుండి జరగలేదు. ఎన్నికలు నిర్వహించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం న్యాయవాది  జయ సుకిన్  కూడ పిటిషన్  దాఖలు చేశారు.

 

 

ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం కోర్టులో సమర్పించిన  తమ  అఫిడవిట్‌లో, ప్రభుత్వం తమ  రాజ్యాంగ  బాధ్యతల నుండి ఎప్పుడూ తప్పుకోలేదని , స్థానిక సంస్థ ప్రతినిధుల కొరత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిర్వీర్యం చేసిందని న్యాయవాది  సుకిన్  చేసిన వాదనలను  ఖండించింది.

   .

మరింత సమాచారం తెలుసుకోండి: