తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు నేతలు  తామూ ఎన్నికల్లో గెలవటానికి ఓట్లు కొనేందుకు డబ్బు ఖర్చువిచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కానీ  కానీ.. రైతును ఆదుకోవడానికి మాత్రం  ఏ ఒక్కరు  ముందుకు రావడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. .రాష్ట్రంలో కులాలకు అతీతంగా రైతు పథకాలు అమలు చేయాలి అంటూ  పవన్ కళ్యాణ్ అడిగారు .

 

రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వకుంటే డిసెంబర్ 12న కాకినాడలో దీక్ష చేస్తానని ఆయన  అన్నారు . ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారతాయి అనే విషయం తానూ  చెప్పలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. రైతు కష్టం నుంచి మరింత కష్టాల్లోకి నెట్టుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ బాధ  వ్యక్తం చేశారు. రైతును ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదని అన్నారు. ధాన్యం విక్రయించిన రైతులకు రసీదులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

 

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎదుటి వారిని అసభ్యకర పదజాలం తో మాట్లాడటం మానుకొని రీతులప్ సమస్యలపై కేంద్రీకరించాలని కోరారు. .అరుపులు, కేకలతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంపై పవన్ కళ్యాణ్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. జనసైనికులకు క్రమశిక్షణ కొరవడటం వల్లే ఓడిపోయానని ఆయన అన్నారు.‘ప్రతి సంవత్సరం అప్పు చేసి రైతులు ఈ ఏడాది అయినా ఆదాయం వస్తుందన్న ఆశతో ఏటికేడాది పంటలు పండిస్తూనే ఉన్నారు. ఏ రోజూ లాభసాటి ధర చూసింది లేదు. ఇప్పటికీ గిట్టుబాటు ధర కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ రైతుకు కావాల్సింది లాభసాటి ధర. రైతు కష్టాన్ని గుర్తించాలి. గిట్టుబాటు కాదు లాభసాటి ధర కోసం ప్రయత్నాలు చేయాలి.


అన్నం పెట్టే రైతు కష్టాలు చెబుతున్నప్పుడు మీరు అరుస్తుంటే.. తనకు ఎలా వినిపిస్తుంది? నిజంగా ఇబ్బందిగా ఉందని కార్యకర్తలనుద్దేశించి పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు.. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది. అది మర్చిపోకండి.. క్రమశిక్షణ ఉండుంటే.. జనసేన గెలిచివుండేది' అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: