ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్ ఇప్పటికే సంచలనల ముఖ్యమంత్రిగా పేరొందాడు. పుట్టిన పసిపాప నుండి వయో వృద్ధురాలు వరుకు ప్రతిఒక్కరికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

               

ఇప్పటికే 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగా ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. అదేంటంటే.. ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా మరో శాఖను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 'నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం' పేరిట కొత్త పాలనశాఖ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు విడుదల చేశారు. 

              

రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్ల నైపుణ్యాభివృద్ధితో పాటు శిక్షణ అంశాలను ఈ శాఖ పర్యవేక్షించనుంది. గతంలో ఇదే పేరుతో ఏర్పాటు చేసిన నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, ఆవిష్కరణల విభాగాన్ని కొత్త ప్రభుత్వ శాఖలో విలీనం చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ విభాగానికి రాష్ట్రస్థాయిలో ఒక కార్యదర్శి, అదనపు కార్యదర్శితో పాటు ఇతర సిబ్బందిని కేటాయించారు. 

                      

రాష్ట్ర ప్రభుత్వంలో 37వ శాఖగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగం ఉండనుంది. దీంతో ఈ కొత్త పాలన శాఖపై ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు.. మారె ముఖ్యమంత్రి తీసుకోలేరు అని.. సీఎం జగన్ తెలుగు ప్రజలకు ఒక దేవుడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: