ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లైంది ఆస్ట్రేలియాలో ఒంటెల పరిస్థితి. కరవుతో అల్లాడుతున్న ఆస్ట్రేలియా.. ఉపశమనం కోసం ఏకంగా పదివేల ఒంటెల సామూహక హననానికి ఒడిగట్టింది. ఈ సామూహిక వధపై జంతుప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఆస్ట్రేలియాలోని సిడ్నీ పరిసర గిరిజన ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తున్న వేలాది ఒంటెలను ఆసిస్ ప్రభుత్వం హతమారుస్తోంది. దాదాపు పదివేల ఒంటెలను హెలికాప్టర్ల సాయంతో.. శిక్షణ పొందిన షూటర్లను వినియోగించి వేటాడుతోంది. గిరిజన ప్రాంతాల రక్షణ, సంస్కృతి కాపాడేందుకు .. ఈసామూహిక వధ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. భారీ సంఖ్యలో ఒంటెలు తమ గ్రామాల్లోకి చొరబడుతున్నాయని.. చిన్నపిల్లలు, ముసలివాళ్ల భద్రతకు ప్రమాదం ఏర్పడిందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటెలు ఇలాగే చొరబడితే.. తాము ఆ ప్రాంతాల్లో ఉండలేమని వారు వాపోతున్నారు. గిరిజనుల ఫిర్యాదుతో ...  ఐదురోజుల పాటు స్పెషల్ హంట్ ను  ప్రారంభించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

 

ఆస్ట్రేలియాను ఓవైపు కార్చిచ్చు కబలిస్తుంటే..మరోవైపు కరవు రక్కసి కాటేస్తోంది. దీంతో తాగునీరు, ఆహారం దొరక్క మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో వేలాదిగా ఉన్న ఒంటెలు.. గిరిజన గ్రామాల్లోకి చొరబడి, నాశనం చేస్తున్నాయి. పంటలు ధ్వంసం చేస్తున్నాయి . నీటి వనరుల్ని కలుషితం చేస్తున్నాయి. దీంతో వీటి నుంచి రక్షించాలంటూ స్థానిక గిరిజనులు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. వేలాదిగా ఒంటెలను హతమార్చాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయంపై.. జంతుప్రేమికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. .దీనికి వేరే ప్రత్యామ్నాయం వెతక్కుండా... మూగజీవాలను విధించడమేంటని నిలదీస్తున్నారు.

 

మూగజీవాలను చంపడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని  జంతువులను చంపడానికి మనసెలా వచ్చిందని నిలదీస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యను మానుకోవాలని కోరుకుంటున్నారు. ఒంటెల సామూహిక వధను నిరసిస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. ఒకేసారి అన్ని ఒంటెలను చంపడంతో అక్కడ దయనీయ పరిస్థితి నెలకొంది. చూసిన వారందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నోరు లేని జీవాలను ఇలా హింసిస్తారా అంటూ మండిపడుతున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: