ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవడానికి ఏకంగా రెండు రోజుల సమయం పట్టింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ ను అవమానించడమే అని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారీ సంఖ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారు.
 
జనసేన పార్టీ అధినేతగా కూడా పవన్ కళ్యాణ్ కు గుర్తింపు ఉంది. కానీ బీజేపీ పార్టీ మాత్రం పవన్ ను ఏకంగా 48 గంటల పాటు ఎదురుచూసేలా చేసి పవన్ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని చెప్పాలి. శనివారం రోజు బీజేపీ పార్టీ ముఖ్య నేతలను కలవడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. మీడియాలో శనివారం రోజు రాత్రే నడ్డాను పవన్ కళ్యాణ్ కలుస్తారని ప్రచారం జరిగింది. 
 
కానీ నడ్డా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో కలవడం కుదరలేదు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలను కలవడానికి ప్రయత్నించినా బీజేపీ నేతలు ఎవ్వరూ పవన్ కళ్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ కు నిరాశే మిగిలింది. ఈరోజు మధ్యాహ్నం నడ్డా అపాయింట్ మెంట్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వెళ్లి నడ్డా నివాసంలో భేటీ అయ్యారు. 
 
కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తారని ప్రచారం జరిగినా అమిత్ షా పవన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ జేపీ నడ్డాను కలిసిన తరువాత కాకినాడకు తిరుగు ప్రయాణమయ్యారు. బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి ఏకంగా రెండు రోజుల సమయం వేచి ఉండేలా చేసిందని అంత సమయం ఎదురు చూసినా కేవలం జేపీ నడ్డా అపాయింట్ మెంట్ మాత్రమే పవన్ కు దొరికిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: