భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల్లో ముఖ్యుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. జనవరి 23వ తేదీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు. సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరంలో జన్మించగా సుభాష్ చంద్రబోస్ మరణం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. జానకీ నాథ్ బోస్, ప్రభావతీ దేవీ దంపతులకు సుభాష్ చంద్రబోస్ జన్మించారు. చిన్నతనం నుండి చురుగ్గా వ్యవహరించే స్వభావం ఉన్న సుభాష్ చంద్ర బోస్ జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పలు పోరాటాలలో భాగస్వామి అయ్యారు. 
 
ఇండియన్ సివిల్ సర్వీసెస్ కు 1920వ సంవత్సరంలో ఎంపికైనప్పటికీ స్వాతంత్ర్యం తీసుకురావడమే తన ప్రథమ కర్తవ్యమని ఉద్యమంలోకి ఉద్యోగాన్ని వదులుకొని మరీ సుభాష్ చంద్రబోస్ అడుగుపెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం రావాలంటే ఇతర దేశాల సహకారం కూడా కావాలని సుభాష్ చంద్రబోస్ భావించారు. దేశానికి స్వాతంత్ర్యం కోసంఆజాద్ హిందూ ఫైజ్ ను స్థాపించిన సుభాష్ చంద్ర బోస్ స్వాతంత్ర్యం రావడంలో కీలక పాత్ర వహించారు. 
 
రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ గాంధీజీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ బేధాలు ఉండటం వలన పదవికి రాజీనామా చేశారు. ఆంగ్లేయులచే కారాగారంలో బోస్ 11సార్లు నిర్భంధింపబడ్డారు. 1939 రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బోస్ జపాను సహాయంతో రబ్బరు తోట కూలీలు, యుద్ధ ఖైదీలు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. 
 
బోస్ విధానాలను కొందరు విమర్శిస్తే మరికొందరు మాత్రం బోస్ వాస్తవిక దృష్టితో ప్రయత్నాలు చేశాడని అతడిని అభిమానిస్తారు. బోస్ జీవితంలో తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదం కాగా బోస్ మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 సంవత్సరం ఆగష్టు నెల 18వ తేదీన తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని ప్రకటన వెలువడింది. కానీ బోస్ ఆ ప్రమాదం నుండి బయటపడ్డాడని బోస్ ఆ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లాడని కొందరు నమ్ముతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: