తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 120 మున్సిపాలిటీలలో 109 మున్సిపాలిటీలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు టీఆర్ఎస్ కు పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేసులో కూడా లేకుండా పోయింది. కేవలం నాలుగు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ హవా చూపించింది. 
 
టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన జగిత్యాలలో విజయం సాధించింది. తొలిసారి జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. చెన్నూరు, మరిపెడ, భీమ్ గల్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. వడ్డేపల్లి, యాదగురి గుట్ట, ఆదిభట్ల, నేరేడుచర్ల మున్సిపాలిటీలను మాత్రం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎంఐఎం ఒక్క మున్సిపాలిటీకి పరిమితం కాగా బీజేపీ రెండు మున్సిపాలిటీలకు పరిమితమైంది. 
 
నారాయణ ఖేడ్ మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ నారాయణ ఖేడ్ ఫలితం మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో చేరేలా ఉంది. ఎక్స్ అఫీషియో ఓట్లు ఇక్కడ ఛైర్మన్ ఎన్నికలో కీలకం కానున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి 3 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉన్నాయి. అందువలన నారాయణ ఖేడ్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు అంతో ఇంతో పోటీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం పొందటంపై రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ప్రముఖులు ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజాయం పొందడం గమనార్హం. దాదాపుగా అన్ని జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీ ప్రభావం కనపడగా కాంగ్రెస్ పార్టీ మాత్రం నామమాత్రపు ప్రభావం కూడా చూపలేక చతికిలపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: