అవయవాలన్నీ సరిగ్గా ఉండి చక్కగా ఉన్న విద్యార్థులకు.. ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉంటారు.అదే  మరుగుజ్జు గా ఉంటే ఎన్నో  విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యార్థికి ఇలాంటి చేదు అనుభవమే  ఎదురైంది. ఆ విద్యార్థికి మరుగుజ్జు రూపమే బాధలకు కారణం అయింది. పాఠశాలలో తోటి విద్యార్థులు అవమానాలకు గురి చేస్తూ ఉంటే అతని మనసు తట్టుకోలేకపోయింది. మనిషిగా పుట్టడం నేను చేసిన పాపమా అంటూ బాధపడిపోయాడు ఆ  విద్యార్థి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ఉందంటూ కన్నతల్లి ముందు కన్నీరు పెట్టుకున్నారు. బ్రిస్బేన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 వివరాల్లోకి వెళితే... బ్రీస్ బెన్ కు  చెందిన క్వాడెన్  తన 9 ఏళ్ల కుర్రాడు ఆచన్లోఫేస్లియా  అనే మరగుజ్జు వ్యాధితో  బాధపడుతున్నాడు. దీంతో స్కూల్లోని తోటి విద్యార్థులు అందరూ చులకన చేస్తూ అవమానించారు. మొదట్లో ఆ కుర్రాడు కూడా వారి మాటలను పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ అవమానాలు రోజురోజుకు పెరగసాగాయి. దీంతో గత బుధవారం రోజు కూడా తీవ్రంగా ఆహ్వానించబడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన క్వాడెన్  తన తల్లి అతని స్కూల్ నుండి  తీసుకెళ్లడానికి రాగా... సైలెంట్ గా  కారులో కూర్చుని ఏడవడం ప్రారంభించింది. ఇక కొడుకు ఏడవటం  చూసిన తల్లి ఏమైంది అని ప్రశ్నించగా జరిగిన అవమానాన్ని తల్లితో చెప్పుకున్నాడు. 

 


 నన్ను చంపేయండి.. లేదా నాకు ఒక తాడు ఇవ్వండి నేను ఉరి వేసుకుంటాను అంటూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కత్తితో ఒళ్లంతా గీసుకోవాలని అనిపిస్తుంది అంటూ కన్నతల్లి ముందు కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు ఏడుస్తున్న దృశ్యాన్ని వీడియో తీసిన తల్లి దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ వీడియో వల్ల ఆ కుర్రాడికి అన్నివర్గాల నుంచి మద్దతు తోడైంది. దీనిపై స్పందించిన ఆ కుర్రాడి తల్లి మా అబ్బాయి అవమానాల పాలు కావడం కొత్తేమీ కాదని ఆ అవమానాన్ని తట్టుకోలేక 3 సంవత్సరాల క్రితం సూసైడ్ ఎటెంప్ట్ కూడా చేశాడు అని మామూలుగా అయితే నేను ఇలాంటి విషయాలను సీక్రెట్గా స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పి ఊరుకునే డాన్ని కానీ నా కొడుకు  బాధ అందరూ తల్లిదండ్రుల తీసుకోవాలంటూ ఆమె ఈ వీడియోని సోషల్ మీడియాలో ఉంచినట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: