అతను కర్నూలు జిల్లా రుద్రవరం ఎస్‌ఐ.. ఏమైందో తెలీదు ఆత్మహత్యకు చేసుకుంటానంటూ పోలీసుల వాట్సాప్‌ గ్రూప్‌లో మెసెజ్ పెట్టి కనిపించకుండా పోయాడు. అయితే అతని ఆచూకీ కోసం వెతకగా వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఉన్నట్లు ఆ ఎస్ఐ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

 

 

కర్నూలు జిల్లాలోని రుద్రవరం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ విష్ణునారాయణ శనివారం అర్ధరాత్రి పోలీసుల వాట్సాప్‌ గ్రూప్‌లో సందేశం పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ మెసెజ్ లో ఏముంది అంటే.. ''ఈ మెసెజ్ మీరు చదివే సమయానికి నేను బతకవచ్చు లేదంటే చనిపోయి ఉండవచ్చు.. దయచేసి నా గురించి ఎవరు చెడుగా అనుకోవద్దు'' అని ఎస్ఐ విష్ణునారాయణ వాట్సాప్‌ మెసేజ్ పెట్టారు.           

 

ఆ మెసెజ్ ను చుసిన ఆళ్లగడ్డ డీఎస్పీ అప్పటికప్పుడే ఎస్‌ఐ ఇంటికి వెళ్లి ఎందుకు ఇలా చేశావు.. అలా అనుకోవద్దు అంటూ ఎస్ఐకి మంచిమాటలు చెప్పి వెళ్లారు.. అయినప్పటికీ ఎస్ఐ విష్ణు నారాయణ ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో ఇంటి నుండి కారులో బయటకు వెళ్లిపోయారు..      

 

దీంతో అయన ఎంతసేపటికి ఇంటికి తిరిగిరాకపోవడంతో ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అయన కోసం పోలీసులు నిన్న ఉదయం నుండి వెతుకుతూనే ఉన్నారు. ఎట్టకేలకు అయన కోసం తీవ్రంగా గాలింపు చేపట్టగా ఎస్ఐ విష్ణునారాయణ పులివెందులలో ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విష్ణు నారాయణ ఎందుకు అలా మెసేజ్ పెట్టారు.. ఒక రోజు అంత ఎందుకు కుటుంబానికి దూరంగా వెళ్లి అందరిని టెన్షన్ పెట్టారు అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు.               

మరింత సమాచారం తెలుసుకోండి: