మన చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఎందరో వ్యాపారులు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే అలాంటి వారిలో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ.. ఉన్నారు.. ఇప్పటి వరకు వీరు చేసిన అప్పులు కూడా రాబట్టుకోలేని దౌర్భాగ్యపు పరిస్దితులు మనదగ్గర నెలకొన్నాయి.. అదే ఒక రైతు పదివేలు అప్పు ఉంటే అతని ప్రాణాలు కూడా తీసుకెళ్లే మనుషులున్న వ్యవస్దలో, ఎన్నో ఆర్ధిక నేరాలు చేసే ఇలాంటి దొంగనాయళ్ల చొక్కలకున్న గుండీలను కూడా విప్పలేకపోతున్నారు..

 

 

ఎవడు తప్పుచేసిన అందరికి ఒకటే న్యాయం అనే మాటలు కాగితాలవరకే పరిమితం అవుతున్నాయనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది.. ఉన్న వాడికి ఒక న్యాయం, లేని వాడికి ఒక న్యాయం ఇక్కడ అమలవుతుంది.. అందుకనే కావచ్చూ ఎప్పుడు న్యాయదేవత కళ్లకు నల్ల బట్ట కట్టి ఉంటుంది.. ఇకపోతే పరారీలో ఉన్న ఆర్ధిక నేరగాడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధమైంది. ఆయనకు చెందిన ఆస్తులను 112 లాట్‌లుగా విభజించి ఆన్‌లైన్‌లోనూ, లైవ్‌లోనూ వేలం వేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

 

 

వివిధ బ్యాంకులకు నీరవ్ మోదీ చెల్లించాల్సిన బాకీలను రికవరీ చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఈ ఆస్తులను వేలం వేస్తున్నారు.. కాగా ఇప్పటికే తాను చెల్లించ వలసిన అప్పులకంటే తన ఆస్తులను ఈడీ ఎక్కువగా లాగేసుకుందని విజయ్ మాల్యా చెబుతున్నప్పటికి అతని మాటలకు అధికారుల నుండి ఎలాంటి స్పందనలేదు.. ఇక ఒకవేళ కనుక రాజకీయాల్లో మార్పు జరిగి ఈ సారి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ కనుక రాకుంటే నీరవ్, విజయ్ మాల్యాలు ఏదో ఒక సెటిల్‌మెంట్ చేసుకుని కొంత వరకు బాకీలు కట్టి దర్జాగా ఇండియాకు వచ్చేవారని అనుకుంటున్నారట.

 

 

ఇప్పటికే పరదేశంలో డబ్బులు పెట్టి పౌరసత్వాన్ని కొనుకున్న ఈ ఆర్ధిక నేరగాళ్లూ ఇక్కడ ఉన్న తమ ఆస్తులను కాపాడుకోవాలని వేసిన ఎత్తులన్ని చిత్తవుతున్నాయి.. దీనికి తాజా ఉదాహరణ నీరవ్ ఆస్తులను వేలాని అనుమతించిన న్యాయస్దానం తీర్పునే.. ఏది ఏమైనా ఇలా మంది సొమ్మును ముంచి, బ్యాంకులకు పంగనామాలు పెట్టి విదేశాల్లో జల్సాలు చేస్తున్న ఆర్ధిక నేరగాళ్లనుండి అప్పులన్ని రాబడితే గాని మనదేశం బాగుపడదని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: