లోకం మొత్తం చెడిపోతుందనడానికి ప్రస్తుతం సమాజంలో జరిగుతున్న ఘటనలు ఎన్నో చెప్పుకోవచ్చూ.. అసలు మనుషులేనా ఈ భూమిమీద నివసిస్తున్నారు అనే సందేహం వస్తుంది.. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవం.. ఒక హిందువే కాదు ప్రతి మతం వారు అత్యంతగా ఇష్టపడే ఆ దేవదేవుడు వేంకటేశ్వరుడు కొలువైనా క్షేత్రం తిరుమల పుణ్యక్షేత్రం.. కలియుగ వైకుంఠంగా ఆరాధించబడుతున్న ఈ ప్రదేశంలో అప్పుడప్పుడు జరిగే నీచమైన పనులను చూస్తే ప్రతి భక్తుడికి ఆవేశం పొంగుకు వస్తుంది..

 

 

ఇక్కడ ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఎన్ని రకాలుగా చర్యలు చేపడుతున్న కొందరు దరిద్రులు మాత్రం, ఈ పుణ్యక్షేత్రంలో అపవిత్రమైన పనులకు పాల్పడుతున్నారు.. ఈ ఏడుకొండలవారిని దర్శించుకోవాలని విదేశాలనుండి కూడా ఎందరో భక్తులు ఇక్కడికి వస్తారు.. ఒక్కసారి ఆ స్వామి వారిని కనులారా కాంచితే చాలు జన్మ ధన్యమనే భావనలో మరెందరో భక్తులు ఉంటారు.. అంతంటి ప్రాచూర్యాన్ని పొందిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రం ఈ మధ్యకాలంలో అపవిత్రం చేస్తున్నారు కొందరు మతిలేని మనుషులు..

 

 

శ్రీవారి సేవలో తరించవలసిన చేతులతో, నోటితో మద్యం తాగుతూ, మాంసం తింటూ అడవి జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.. ఇదిగో ఇలా ఎన్ని సార్లు జరిగిన పోలీసులు అరెస్ట్ చేసినా ఇలాంటి నీచుల్లో మాత్రం మార్పు రావడం లేదు.. నీ మతాన్ని నువ్వు నమ్ముకో కానీ ఇతర మతాలను కించపరిచే హక్కు మన రాజ్యాంగం ఎవ్వరికి కల్పించలేదు.. ఈ విషయాన్ని విస్మరించిన కొందరు వెధవలు తిరుమల కొండపైన ఇష్టారీతిగా వ్యవహరిస్తూ, మద్యం తాగుతూ, మాంసం తింటూ... తిరుమల క్షేత్ర పవిత్రతకు భంగం కలిగిస్తున్నారు. ఇలా చేస్తున్న 14 మందిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు..

 

 

వీరంతా స్థానిక బాటగంగమ్మ ఆలయం దగ్గర్లో మాంసం తింటూ... మద్యం తాగుతున్నట్లు పోలీసులకు తెలియగా, అక్కడికి వెళ్ళిన వీరిని చూసి ఆ వెధవలు పారిపోవడానికి ప్రయత్నించగా ఆ నీచులను పట్టుకున్న పోలీసులు వారిని టీటీడీ అశ్వినీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు జరిపించారు. అలాగే... ఆ 14 మందిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్‌తోపాటూ... తిరుమల నోటిఫై... ఏరియా చట్టం కింద కేసు రాశారు. ఎవరైనా సరే... ఇలాంటి వెధవ్వేషాలు తిరుమలలో వేస్తే... చట్టప్రకారం తాట తీస్తామంటున్నారు పోలీసులు... ఇక పోయేకాలం వస్తే ఇలాంటి విపరీత బుద్ధులే పుడతాయి.. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు మళ్లీ జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా శిక్షించాలని భక్తులు కోరుకుంటున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: