దేశంలో ఇప్పటికే ఒక్కవైపు కొరోనా.. మరోవైపు స్వైన్ ఫ్లూతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం ఉన్న రోగాల నుండి ఎలా బయటపడాలి అనేలోపే వారికీ మరో కొత్త వ్యాధి స్వాగతం అంటూ వచ్చి అందరిని బెంబేలెత్తిస్తుంది. తాజాగా కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది.

 

కోజికోడ్‌ జిల్లాలోని కొడియతూర్‌, వెంగర గ్రామాల్లో రెండు వారాలుగా కోళ్లు పెద్ద సంఖ్యలో అకస్మాత్తుగా చనిపోయాయి. అధికారులు అనుమానంతో వాటి నమూనాలను పరీక్షలకు పంపించారు. భోపాల్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌.. ఆ కోళ్లకు బర్డ్‌ ఫ్లూ ఉన్నట్లు నిర్దారించింది.

 

ప్రధానంగా రెండు పౌల్ట్రీ ఫాంలలోనే బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఆ పరిధిలో ఇంకేవైనా పౌల్ట్రీ ఫాంలకు వైరస్ సోకిందేమోనని పరిశీలిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని కోళ్లతో పాటు వైరస్ సోకిన ఇతర పక్షులు, పశువులను కూడా తొలగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రైతులకు నష్ట పరిహారం అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

 

ఇప్పటివరకు మనుషులకు ఎవ్వరికి ఈ వైరస్ సోకలేదని వెల్లడించారు. ఏటా వేసవి కాలంలో కోళ్లు, ఇతర పక్షులకు బర్డ్ ఫ్లూ సోకుతున్న విషయాన్నివారు గుర్తు చేశారు. నేపథ్యంలో వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని.. అలాగని భయపడాల్సిన పని లేదని ఆమె వివరించారు. వైరస్ నియంత్రణకు అన్ని చర్యలూ తీసుకున్నట్లు తెలిపారు. అధికారులతో 25 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో టీమ్‌లో ఐదుగురు సభ్యులు ఉంటారని చెప్పారు.

 

అళప్పురలో బర్డ్‌ ఫ్లూ కారణంగా వేలాది బాతులు మృత్యువాతపడడ్డాయి. వైరస్ సోకిన వేలాది బాతులను చంపి, పాతిపెట్టారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా మళ్లీ అక్కడ బర్డ్‌ ఫ్లూ సోకడంతో కలకలం రేగుతోంది. బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో చికెన్, కోడి గుడ్ల రేట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దింతో ఆర్థిక వ్యవస్థపై వేటు పడే అవకాశాలు కనపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: