చైనా దేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్.... ఇప్పటికే మూడు వేల 400 మందికి పైగా ప్రాణాలను హరించింది. అంతేకాకుండా 90 వేల మందికి పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. ఇక అనుమానితుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుండటంతో కరోనా  పేషంట్లకి చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రులు కూడా శరవేగంగా నిర్మిస్తుంది చైనా ప్రభుత్వం. ఇక చైనాలోని డాక్టర్లు నర్సులు అందరూ 24 గంటలు కరోనా  రోగులకు వైద్యం అందించేందుకు నిమగ్నమైపోయాడు. కనీసం ఇళ్లకు కూడా వెళ్లకుండా... వైద్యాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు చైనాలోని వైద్యులు నర్సులు. 

 

 

 ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. కరోనా  వల్ల మహిళలకు అవమానమే జరుగుతుందని అక్కడి మహిళల సంఘాలు అంటున్నాయి. కరోనా  ఎఫెక్టుతో మహిళల జుట్టు కత్తిరించడం ఒక రకంగా అవమానించడమే అంటున్నారు అక్కడి మహిళా సంఘాలు. పెద్ద జుట్టు ఉంటే కరోనా ఎక్కడ వ్యాపిస్తుందని చైనాలో అధికారులు కరోనా  రోగులకు సేవ చేసే మహిళ నర్సుల జుట్టుని కత్తరిస్తున్నారు. అంతే కాదు మహిళా నర్సులు నిరంతరం సేవలు అందించేలా పీరియడ్స్ రాకుండా ఉండేందుకు పిల్స్  కూడా ఇస్తున్నారు అక్కడ అధికారులు. దీంతో ఈ విషయాలన్నీ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ బయటపెట్టడంతో సంచలనం గా మారిపోయింది. 

 

 

 ఇలా జుట్టూ కత్తిరించడం లేదా పీరియడ్స్ రాకుండా పిల్స్ ఇస్తుండటం మహిళలను ఒక రకంగా అవమానించడమే అంటూ చైనా ఉమెన్స్ ఫెడరేషన్ పోరుబాట పట్టింది. కరోనా  పేషెంట్లకు సేవ చేసేటప్పుడు ధరించే ఐసొలేషన్  సూట్ లే  మహిళలు ధరించటం  మహిళలకు చాలా ఇబ్బంది..అయినప్పటికీ రేయింబవళ్ళు పని చేస్తున్నారు మహిళలు. ఇక అటు కరోనా  రోగుల కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిన చైనా ప్రభుత్వం మహిళల శానిటరీ ప్యాడ్స్ మాత్రం సరఫరా చేయలేక పోవడం అవమానం అంటున్నారు ఉమెన్స్ ఫెడరేషన్. పిల్స్ వేసి పీరియడ్స్  ఆపేస్తే అవి మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. అయితే అక్కడ వైద్యం చేస్తున్న నర్స్ లను  కమాండ్ చేస్తున్న పై అధికారులు మొత్తం మగవాళ్ళని... ఇలాంటివారికి ఆడవాళ్ళ ఇబ్బందులు ఏమి తెలుస్తాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది చైనా ఉమెన్ ఫెడరేషన్.

మరింత సమాచారం తెలుసుకోండి: