చైనాకు గడ్డు కలం నడుస్తుంది... మరో విషాద సంఘటన చైనాను కుదిపేసింది. ఇప్పటికే కరోనావైరస్ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంతో ఈ తాజా సంఘటన పుండు మీద కారం జల్లినట్లు అయింది. కరోనా అనుమానితుల్ని వైద్య పర్యవేక్షణలో ఉంచిన క్వారంటైన్ హోటల్ భవనం కుప్పకూలడంతో పది మంది ఆకికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి పైగా.. వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారుల సమాచారం. 

 

క్వాన్ జై నగరంలో శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం చోటు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఆ భవనంలో సుమారు 100 మందికిపైగా ఉన్నట్లు సమాచారం.  ప్రమాద సంఘటన పైన  సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక బృందాలను రంగంలోకి దింపాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 

 

మొత్తం 53 మందిని కాపాడామని, 46 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది మొత్తం కలిపి దాదాపుగా వెయ్యి మంది వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. బాధితులంతా కరోనా అనుమానితులు కావడంతో సహాయ సిబ్బంది టోపీలు, మాస్కులు, కళ్లజోడు లాంటి ఎక్విప్మెంట్ ధరించారు. క్వారంటైన్ భవనంలో ప్రమాద సమయంలో 98 మంది కరోనా అనుమానితులు ఉన్నారని అధికారులు అధికారికంగా  వెల్లడించారు.

 

కాగా, ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే చైనాలో వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో 50వేల మందికిపైగా కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వినికిడి. 
ప్రస్తుతం చైనాలో తగ్గుముఖం పట్టినప్పటికిని, ఇప్పుడది ప్రపంచ దేశాలకు ప్రబలడం, ప్రపంచ ప్రజలు ఒకింత భయాందోళనకు గురి అవుతున్నారు. చైనా కాకుండా ఇతర దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటం మన అందరికి విదితమే. ఇటలీలో 200 మందికిపైగా, అమెరికాలో 50 మందికిపైగా కరోనాతో ప్రాణాలు కోల్పోవడం ఇపుడు ప్రపంచంలో కరోనా అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: