తెలుగుదేశంపార్టీ నేతలు ప్రయాణిస్తున్న కారుపై మాచర్లలో కొందరు దాడి చేయటం సంచలనంగా మారింది. అయితే దాడి జరిగిన విషయం వాస్తవమే కాని అందుకు చంద్రబాబునాయుడు చెప్పినట్లుగా పార్టీల గొడవలో లేకపోతే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో నామినేషన్లు వేయటమో కాదని తెలుస్తోంది. అసలు గొడవ జరగటానికి టిడిపి నేతలే కారణమని కూడా అర్ధమవుతోంది. కానీ జరిగిన గొడవ విషయంలో చంద్రబాబు రెచ్చిపోయి ఇటు జగన్మోహన్ రెడ్డితో పాటు అటు డిజిపిని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.

 

ఇంతకీ  విషయం ఏమిటంటే టిడిపి నేతల నామినేషన్లు వేస్తున్న సందర్భంగా పాల్గొనేందుకు బోండా ఉమ, బుద్ధా వెంకన్న అండ్ 10 కార్లలో మాచర్లకు వెళ్ళారట. అయితే కార్లలో వెళ్ళే క్రమంలో కాన్వాయ్ లోని ఓ కారు ఓ వికలాంగుడిని గుద్దేసిందిట. వికలాంగుడిని గుద్దేయటమే కాకుండా అడిగినందుకు బోండా, బుద్దా అడిగిన వాళ్ళను నోటికొచ్చినట్లు తిట్టారని సమాచారం. దాంతో మండిపోయిన స్ధానికులు వెంటనే కారుపై దాడి చేశారు.

 

అయితే అసలు విషయాన్ని దాచిపెట్టి, వికలాంగుడిని బోండా, బుద్దా ప్రయాణిస్తున్న కారు గుద్దిన విషయాన్ని కప్పిపెట్టి జరిగిన గొడవను మాత్రమే చంద్రబాబు బాగా హైలైట్ చేశారు. దాంతో విషయం ఒక్కసారిగా పెద్దదయిపోయింది. ఆరోపణలు చేయటమే కాకుండా డిజిపి, ఎన్నికల కమీషన్ కు కూడా చంద్రబాబు జగన్ పై ఫిర్యాదు చేశారు. దాంతో విషయం కాస్త సీరియస్ అయిపోయింది.  సరే జరిగిన  ఘటన ఏమిటనే విషయాన్ని మంత్రి బొత్సా సత్యనారాయణ, ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో చెప్పినా మెజారిటి మీడియా చంద్రబాబు చెప్పిన దాన్నే క్యారీ చేసింది.

 

విషయం చివరకు డిజిపి దాకా వెళ్ళటంతో వెంటనే డిజిపి విచారణకు ఆదేశించారు. గుంటూరు రూరల్ ఎస్పీ విచారణ కోసమని మాచర్లకు వెళ్ళారు లేండి. విచారణలో ఎలాగూ అసలు విషయం ఏమిటనేది బయటపడుతుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే ప్రతి చిన్న విషయాన్ని బూతద్దలంలో చూపటం లేకపోతే తప్పులు తమలోనే పెట్టుకుని ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేయటం చంద్రబాబు, టిడిపి నేతలకు బాగా అలవాటైన విద్య. మెజారిటి మీడియా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిందే ప్రచారం అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: