ప్రస్తుతం ప్రజలందరిని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది మరణిస్తున్నారు. మరి కొందరు ఈ వ్యాధి భారిన పడి కోలుకోలేకపోతున్నారు. అలాంటి ఈ కరోనా వైరస్ ను తరిమికొట్టడానికి ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి ఈ సమయంలో కరోనా తరమడానికి ఈ వంటకం భలే ఉపయోగ పడుతుంది అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వార్త ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. మనం అందరం ఎప్పుడు తింటుంటాం కదా! మిరియాల పులిహోర. అయితే ఈ మిరియాల పులిహోర ఎలా చేస్తారు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

మిరియాల పులిహోరకు కావాల్సిన పదార్ధాలు.. 

 

అన్నం- కప్పు, 

 

మిరియాల పొడి - టేబుల్‌ స్పూను, 

 

ఎండుమిర్చి- నాలుగు, 

 

కరివేపాకు- రెండు రెమ్మలు, 

 

పల్లీలు- టేబుల్‌ స్పూను, 

 

జీడి పప్పు - కొన్ని, 

 

పసుపు - పావుచెంచా, 

 

ఉప్పు- తగినంత, 

 

చింతపండు - నిమ్మకాయ, 

 

నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, 

 

పోపు దినుసులు - రెండు చెంచాలు. 

 

తయారీ విధానం..  

 

పాన్ పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. అది వేడి అయ్యాక పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అందులోనే పోపు దినుసులు వేసి దోరగా వేగాక ఎండుమిర్చీ, జీడిపప్పు పలుకులూ, కరివేపాకూ వేయాలి. రెండు నిమిషాల తరవాత చింతపండు గుజ్జు వేసి మంట తగ్గించాలి. అది ఉడికాక అన్నం, పసుపూ, ఉప్పూ, మిరియాల పొడీ, వేయించిన పల్లీలూ వేసి బాగా కలిపి దింపేయాలి. అంతే మిరియాల పులిహోర రెడీ. 

 

అయితే ఈ వంటకంతో కరోనా వైరస్ తగ్గుతుంది అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వాట్సాప్ లో తెగ షేర్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: