రోజురోజుకు కరోనా  వైరస్ భారతదేశంలో కోరోలు చాస్తూ ఎంతో మందిని కరోనా వైరస్ బారిన పడేలా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ... కరోనా  వైరస్ వ్యాప్తి మాత్రం రోజురోజుకూ పెరిగిపోతునే  ఉంది. దీంతో ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ కి  పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భారత ప్రజలందరూ సమన్వయంతో ఉండి.. భారత జాతి ఐక్యతను చాటాలని... ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ  పాటించాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించి  దేశాన్ని రక్షించండి అంటూ పిలుపునిచ్చారు. మీ జీవితంలోని ఒక్కరోజు నాకు ఇవ్వండి మీ సమస్య మొత్తం పారద్రోలుతా  అంటూ హామీ ఇచ్చారు.. 

 

 

 దేశం మొత్తం నిశ్శబ్దం గా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జనతా కర్ఫ్యూ  పాటించాలంటూ తమ తమ రాష్ట్ర ప్రజలందరికీ పిలుపునిచ్చాయి. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే జనత  కర్ఫ్యూ  పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమై  అయిపోయాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఎవ్వరు కూడా  బయట కనిపించే వద్దని... ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలి అంటూ ఆదేశాలు జారీ చేసాయి. అయితే అటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ  పాటిస్తూ... భారత ఐక్యతను చాటుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రస్తుతం నిశ్శబ్దం గా మారిపోయాయి. 

 

 

 అయితే జనతా కర్ఫ్యూ లో భాగంగా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు కూడా తీసుకుంటున్నాయి. అయితే నిజాంబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామ అభివృద్ధి కమిటీ కరోనా వైరస్ నియంత్రణ కు జనతా కర్ఫ్యూ  పాటించడం పై మరో అడుగు ముందుకేసింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ గ్రామ ప్రజలందరూ జనతా కర్ఫ్యూ  పాటించాలని... ఎవరు బయటకు రావద్దు అంటూ గ్రామాభివృద్ధి కమిటీ సూచించింది. ఒకవేళ ఎవరైనా బయట తిరిగితే వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని అంటూ తెలిపింది. ఈ విషయం ఊరి ప్రజలందరికీ తెలిసేలా చాటింపు చేయించారు. ఇక విదేశాలనుండి ఊరికి ఎవరైనా వస్తే సమాచారం అందించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: